Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హత్య కేసులో చిలుక సాక్ష్యం.. దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టు!!

2014లో జరిగిన ఒక హత్య కేసులో చిలుక చెప్పిన సాక్ష్యం కేసులో కీలకంగా మారింది. చిలుక హత్య కేసు నిందితులను పోలీసులకు పట్టించడంతో, పోలీసులు మర్డర్ కేసును ఛేదించారు. చిలుక చేసిన పని, ఇచ్చిన ఎవిడెన్స్ వల్ల ఏకంగా దోషులకు శిక్ష కూడా పడింది.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ మర్డర్ కేసు వివరాల్లోకి వెళితే..

ప్రముఖ ఆగ్ర వార్తాపత్రిక ఎడిటర్ గా పనిచేసే విజయ్ శర్మ యొక్క భార్య నీలం శర్మ ఫిబ్రవరి 20, 2014వ సంవత్సరంలో హత్య గావించబడ్డారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు ఇంట్లోని నగదు, నగలను ఎత్తుకెళ్లారు. అయితే సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులకు నిందితులు ఎవరు అన్న దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తన భార్యను ఎవరు హత మార్చారు? అన్నది విజయ్ శర్మకు కూడా మిస్టరీగానే మారింది.

ఇక ఇదే సమయంలో నీలం శర్మ మృతి తర్వాత చిలుక తినడం మానేసి భయపడుతూ గడిపింది. అది గమనించిన విజయ్ శర్మ చిలుక హత్యకు ప్రత్యక్ష సాక్షి అయి ఉంటుందని అనుమానించి చిలుక వద్ద ఒక్కొక్కరి పేరును చెబుతూ దాని రియాక్షన్ ను గమనించాడు.

parrot evidence in the murder case.. The court sentenced life imprisonment to the culprits!!

అశుతోష్ గోస్వామి పేరు చెప్పగానే చిలుక వణికిపోతూ "అశు ఆయా థా" అంటూ అరవడం మొదలు పెట్టింది. ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు చిలుక నీలం శర్మ మేనల్లుడు పేరు చెప్పడంతో విజయ్ శర్మ తన భార్య మేనల్లుడిని ఒకసారి విచారించాలని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అశుతోష్ గోస్వామిని ఈ కేసులో విచారిస్తే అసలు విషయం బయటపడింది.

దీంతో మేనల్లుడు అశుతోష్ గోస్వామిని విచారించిన పోలీసులు అశుతోష్ గోస్వామి అతని స్నేహితుడు రోనీ మాన్సే సహాయంతో నీలం శర్మను హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. నగదు, నగలు దోపిడీ చేయడం కోసమే ఇంట్లో నీలం శర్మ మాత్రమే ఉన్న సమయంలో వచ్చి, పెంపుడు కుక్కను నీలం శర్మను హతమార్చి దోపిడీకి పాల్పడినట్టుగా అశుతోష్ ఒప్పుకున్నాడు. పెంపుడు కుక్కను తొమ్మిది సార్లు, నీలం శర్మ 14 సార్లు కత్తితో పొడిచి, దోపిడీ చేసినట్టుగా అశుతోష్ ఒప్పుకోవడంతో, చిలుక చెప్పిన సాక్ష్యం నిజమైంది.

ఈ ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోయింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి సమయంలో 2020లో విజయ్ శర్మ మరణించారు. అయినప్పటికీ విజయ్ శర్మ కుటుంబ సభ్యులు ఈ కేసులో నేరస్తులకు శిక్ష పడాలని పోరాటం చేశారు.

దీంతో తొమ్మిదేళ్ళ తర్వాత కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించడంతోపాటు 72 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే చిలుక సాక్ష్యం విషయంలో చట్టంలో నిబంధన లేని కారణంగా సాక్ష్యంగా సమర్పించబడలేదు. కానీ కేసు అంతా చిలుక ఆధారంగానే సాగడం కీలక పరిణామం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+