గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, హార్దిక్ పటేల్ డెడ్ లైన్, కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం, మద్దతు !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తున్న పాటిదార్స్ (పటేల్) వర్గానికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్దార్థ్ పటేల్ అన్నారు. సిద్దార్థ్ పటేల్, గుజరాత్ హైకోర్టు న్యాయవాది బాబుబాయ్ మాంగుక్యాతో కలిసి మీడియాతో మాట్లాడారు.

గుజరాత్ లో పటేల్ వర్గానికి విద్యారంగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు హామీ ఇస్తే మీకు మద్దతు ఇస్తామని ఆ వర్గం నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ నాయకులకు చెప్పారు. పటేల్ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు అనే విషయం నవంవర్ 7వ తేదీ లోపు చెప్పాలని హార్దిక్ పటేల్ డెడ్ లైన్ పెట్టాడు.

Party may take final call on Monday on Patel quota: Gujarath Congress leader

సోమవారం రాత్రి లోపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పటేల్ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు కేటాయించాలి అనే విషయంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దార్థ్ పటేల్ స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం జరకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పటేల్ రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకుంటుందని గుర్తు చేశారు.

మరో వైపు పటేల్ వర్గాన్ని ఆకర్షించడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలోని పటేల్ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బ తియ్యాలని ప్లాన్ వేశారని తెలిసింది. పటేల్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ ఎలాగైనా ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి పగ తీర్చుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
he Congress might take a final call on Monday on the issue of promising reservation for Patidars under the OBC category, a condition set by quota spearhead Hardik Patel for extending his community's support to the party in poll-bound Gujarat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి