వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ కన్నుమూత, ఆమె ప్రస్థానం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సూపర్ స్టార్, డా. రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్(77) బుధవారం తెల్లవారుజామున 4.40గంటలకు కన్నుమూశారు. అనారోగ్య కారణంగా బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

పార్వతమ్మ మృతదేహాన్ని ఆమె కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ నివాసానికి తరలించారు. ప్రముఖులు, ప్రజలు ఆమెకు నివాళులర్పించేందుకు ఆమె మృతదేహాన్ని పూర్ణ ప్రజ్ఞా మైదానంలో ఉంచనున్నారు. కాగా, ఆమె భర్తలానే ఆమె కూడా తన కళ్లను దానం చేశారు. పార్వతమ్మ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

మే 14 నుంచి ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సమస్యతోపాటు మూత్రపిండ వ్యాధితో ఆమె గత కొంత కాలంగా బాధపడుతున్నారు. దీంతో ఆమెను వెంటిలేషన్‌లో పెట్టారు. చికిత్స సమయంలోనే ఆమెకు తీవ్రమైన జ్వరం రావడం కూడా ఆమె మరణానికి కారణమైంది.

 పార్వతమ్మ రాజ్‌కుమార్ ప్రస్థానం

పార్వతమ్మ రాజ్‌కుమార్ ప్రస్థానం

కర్ణాటకలోని మైసూరు జిల్లా సలిగ్రామలో డిసెంబర్ 6, 1939లో అప్పాజీ గౌడ్, లక్ష్మమ్మ దంపతులకు పార్వతమ్మ జన్మించారు. ఈ దంపతులకు పార్వతమ్మ రెండో కూతురు. మొత్తం వారికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కాగా, 1953, జూన్ 25న తన 13వ యేటనే పార్వతమ్మ.. రాజ్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు.

 సినీ నిర్మాతగా

సినీ నిర్మాతగా

వజ్రేశ్వ కంబైన్స్ లేదా పూర్ణిమ ఎంటర్‌ప్రైజెస్ అనే సినిమా ప్రొడక్షన్ సంస్థను ఫ్యామిలీ సహకారంతో స్థాపించారు. ఆమె తన నిర్మాణ సంస్థ తొలి సినిమానే తన భర్త రాజ్‌కుమార్‌ హీరోగా నిర్మించారు. ఆమె 80కిపైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. అంతేగాక, తన ముగ్గురు కుమారులను కూడా ఆమె హీరోలను చేశారు.

 రాజ్‌కుమార్‌తో హిట్ సినిమాలు

రాజ్‌కుమార్‌తో హిట్ సినిమాలు

సినీ పరిశ్రమలో గొప్ప సినిమాలుగా నిలిచిన త్రిమూర్తి, హాలు జేను, కవిరత్న కాలిదాస, జీవన ఛైత్రం లాంటి చిత్రాలను ఆమె నిర్మించగా, వీటిలో రాజ్ కుమార్ లీడ్ రోడ్ చేశారు. అంతేగాక, ఆనంద్, ఓమ్, జనుమద జోడీలతోపాటు మరికొన్ని చిత్రాలను తన కుమారుడు శివరాజ్ కుమార్ హీరోగా ఆమె నిర్మించారు.

 ముగ్గురు కుమారులు హీరోలుగా..

ముగ్గురు కుమారులు హీరోలుగా..

మరో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ హీరోగా చిరంజీవి సుధాకర్, నంజుండి కళ్యాణ, స్వస్తిక్, తువ్వి తువ్వి తువ్వి చిత్రాలను ఆమె నిర్మించారు. ఆమె చిన్న కుమారుడు పునీత్ రాజ్‌కుమార్‌తో అప్పు, అభి, హుదుగురు చిత్రాలను నిర్మించారు. కాగా, పార్వతమ్మ సోదరులు ఎస్ఏ చిన్నే గౌడ, గోవిందరాజ్, ఎస్ఏ శ్రీనివాస్ లు కూడా సినీ నిర్మాతలే కావడం విశేషం.

English summary
Parvathamma Rajkumar, wife of matinee idol, Dr Rajkumar has passed away at the age of 77. She passed away at the M S Ramaiah hospital at Bengaluru at around 4.40 am today. Her body has been taken to her son Raghavendra Rajkumar's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X