బెంగళూరులో అయిదేళ్ల పిల్లాడిపై దారుణం- సీసీటీవీ ఫుటేజీలో.. !!

బెంగళూరులో ఓ అయిదేళ్ల బాలుడిపై అమానుషంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. రోడ్డుపై ఆడుకుంటున్న ఆ బాలుడిని కాలితో ఫుట్‌బాల్‌లా బలంగా తన్నాడు. బెంగళూరు త్యాగరాజనగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు.

ఆ బాలుడు పేరు నీవ్ జైన్. తన మేనత్తతో కలిసి రోడ్డుపై సరదాగా బ్యాడ్మింటన్ ఆడుతుండగా, వెనుక నుంచి పరుగెత్తకుంటూ వచ్చిన ఓ వ్యక్తి అతడిని బలంగా తన్నాడు. దీంతో ఆ బాలుడు బంతిలా గాలిలోకి ఎగిరి దూరంగా పడిపోయాడు. కింద పడ్డ బాలుడిని దాటుకుంటూ ఏమీ తెలియనట్టు ఆ వ్యక్తి నింపాదిగా వెళ్లిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. నెటిజన్లు ఈ వీడియోను పోలీసులకు ట్యాగ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి అనుగుణంగా పోలీసులు స్పందించారు.

Passerby Kicks a Boy in Bengaluru

ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అయిదేళ్ల వయస్సున్న నీవ్ జైన్ ను రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. రంజన్, బాలుడి తల్లి ఇరుగుపొరుగు వారే. ఈ దాడిలో బాలుడి కంటి వద్ద తీవ్ర గాయం అయినట్లు గుర్తించారు. బాధితురాలి మేనత్త దీపికా జైన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీపికా జైన్ తన సోదరుడిని చూడటానికి త్యాగరాజనగర్‌కు వచ్చారు. సోదరుడి కొడుకుతో కలిసి రోడ్డుపై సరదాగా బ్యాడ్మింటన్ ఆడుకుంటోండగా.. రంజన్ ఈ దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటన పక్క ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా బనశంకరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 35 ఏళ్ల రంజన్‌ను కోర్టులో హాజరుపరిచారు. మొదట జ్యుడీషియల్ కస్టడీ విధించినా, బెయిల్ పై విడుదలైనట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలో, నిందితుడి మానసిక స్థితి స్థిరంగా లేదని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనపై బెంగళూరు నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "పిల్లలపై రాక్షసుడిలా దాడి చేసే ఈ కిరాతకుడు జైలులోనే ఉండాలి. రోడ్డుపై చిన్నారిని తన్నిన వ్యక్తిపై బనశంకరి పోలీసులు పనికిరాని సెక్షన్లు పెట్టి విడుదల చేశారు. ఇతను ఎవరినైనా చంపిన తర్వాతే చర్యలు తీసుకుంటారా?" అంటూ ప్రజలు నిరసన తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+