
viral video:పళ్లను కోస్తూ.. అరుస్తూ విక్రయం, సంబరపడిన జనం.. వైరల్ (వీడియో)
పండ్లు, ఫలాలు అమ్మడం కూడా ఓ కళే. అవును కస్టమర్లను ఆకట్టుకోవాలి.. వాటిని తీసుకోవాల్సిందేనని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించాలి. అవును ఇదీ పక్కా మార్కెటింగ్ ఫీల్డే.. మార్కెటింగ్ వారు అయితే సూటు.. బూటు వేసుకొని చెబుతారు. పాలసీ కొనాలని చెబుతారు. మరీ రోడ్డుపై ఉండే పండ్లు, చిన్న చిన్న వస్తువులు అమ్మేవారు ఏం చేయాలి.. కస్టమర్ల చేత తమ వస్తువులను కొనిపించాలంటే ఏం చేయాలి.. ఇదిగో ఈ వీడియోలో ఉన్న వ్యక్తి అలానే చేశాడు.. మరీ మీరు కూడా చూడండి.

హావభావాలు చూడండి..
రోడ్డుపై ఓ పండ్ల వ్యాపారి ఉన్నాడు. తన బండిపై వాటర్ మిలన్, పాపాయ ఉన్నాయి. అయితే వాటిని విక్రయించేందుకు నయా టెక్నాలజీ యూజ్ చేశాడు. వాటిని అందంగా కత్తిరించి చూపించాడు. దానిని వీడియో తీసి రెడిడిట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ పళ్లను కత్తిరించే సమయంలో అతని హవభావాలు చూడాలీ.. చిత్ర, విచిత్రంగా పెట్టాడు. అక్కడున్న జనం తప్పకుండా ఆగి.. అతనితో మాట్లాడాల్సిందే అన్నట్టు వ్యవహరించాడు.
వాటర్ మిలన్, పాపాయ ఇలా..
వాటర్ మిలన్ నిలువుగా రెండు ముక్కలు చేశాడు. మళ్లీ వాటిని నాలుగు చేశాడు. చేయితో ఆడి ఆడి.. మరీ కట్ చేశాడు. ఇక పాపాయను అయితే కత్తితో కట్ చేశాడు. అదీ మంచి షేప్ వచ్చింది. ఇంకేముంది దానిని చూసి నోరు తోరచి ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ సమయంలో అరచి గోల చేశాడు. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 65 వేల మంది లైక్ చేశారు.

అరుస్తూనే
వీడియోను చూసి చాలా మంది ఎంజాయ్ చేశారు. క్రోగర్ కంపెనీ ప్రచారం కోసం చూస్తుందని.. దానికి ఇతను సరిపోతడాని మరొకరు సూచించారు. అరిచిన సమయంలో హవభావాలు బాగున్నాయని మరొకరు కామెంట్ చేశారు. ఇలా చాలా మంది కామెంట్స్ చేశారు. నిజానికి ఆ వీడియో కూడా అలానే ఉంది. దానిని చూస్తున్నంత సేపు.. అలానే ఉండిపోతారు. వీడియో చూసిన చాలా మంది వావ్ అంటున్నారు. మరీ ప్రత్యక్షంగా చూసిన వారు తెగ థ్రిల్ అయి ఉంటారు.