Passport రూల్స్ మారాయి, ఎల్లుండి నుంచి చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు
భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ నిబంధనల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయడం చాలా మందికి కాస్త కష్టంగా, టైమ్ తీసుకునే ప్రక్రియగా అనిపిస్తుంది. ఆ ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తయ్యేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ముందుగా పత్రాల విషయానికి వస్తే... ఇక అంతా కాగితాల బండి మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆధార్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కువ ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. డాక్యుమెంట్ల జాబితాను కూడా తగ్గించారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. పత్రాలు తప్పుగా లేదా పూర్తిగా అప్‌లోడ్ చేయకపోతే దరఖాస్తు నేరుగా తిరస్కరించబడుతుంది. కాబట్టి అప్లై చేసే సమయంలో జాగ్రత్తగా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

పోలీస్ వెరిఫికేషన్ విషయంలో కూడా మంచి మార్పులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియకు వారాల తరబడి టైమ్ పట్టేది. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ ద్వారా అధికారుల మధ్య డేటా షేరింగ్ వేగంగా జరుగుతుంది. దీంతో వెరిఫికేషన్ రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముందుగా పాస్‌పోర్ట్ జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ పూర్తి చేసే విధానాన్ని కూడా అనుమతించవచ్చు. అయినా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు చెబుతున్నారు.
Passport కొత్త పోర్టల్..
ఇంకా ఒక ముఖ్యమైన విషయం.. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన పాస్‌పోర్ట్ పోర్టల్. ఫారం నింపడం నుంచి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం, అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడం, అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. రియల్ టైమ్ మెసేజ్ అలర్ట్‌లు కూడా వస్తాయి. మధ్యవర్తుల అవసరం లేకుండా, ఇంటి దగ్గర నుంచే ఎక్కువ భాగం పూర్తిచేయవచ్చు.
పిల్లల పాస్‌పోర్ట్ విషయంలో కూడా కొంత సౌలభ్యం కల్పించారు. డిజిటల్ బర్త్ సర్టిఫికేట్, స్కూల్ ఐడీ, తల్లిదండ్రుల సింపుల్ కన్సెంట్ పత్రాలను సులభంగా అంగీకరిస్తారు. దీంతో మైనర్ల దరఖాస్తుల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాస్‌పోర్ట్ కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ప్రజలు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.
మొత్తానికి ఈ కొత్త మార్పుల లక్ష్యం ఒకటే.. పాస్‌పోర్ట్ సేవలను వేగంగా, సురక్షితంగా, సులభంగా అందించడం. ఫిబ్రవరి 15 తర్వాత అప్లై చేసే వారు కొత్త నిబంధనల ప్రకారం పత్రాలు సిద్ధం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాసెస్ పూర్తవుతుంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications