వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచిత వై-ఫైతో పబ్లిక్ గా ఏం చూస్తున్నారంటే ?

|
Google Oneindia TeluguNews

పాట్నా: రైల్వే స్టేషన్లలో ఫ్రీ వై-ఫైని యువత దుర్వినియోగం చేస్తున్నదని వెలుగు చూసింది. రైల్వే ష్టేషన్ లో ఉచిత వై-ఫై ఉపయోగించుకోవడంలో బీహార్ రాజధాని పాట్నా మొదటి స్థానంలో ఉంది.

రైల్వే స్టేషన్లో ఉచిత వై-ఫై ఉపయోగిస్తు ఏం చూస్తున్నారు అనే విషయాన్ని రైల్వే శాఖ అధికారులు గుర్తించారు. ఫ్రీ వై-ఫై ఉపయోగించుకుంటున్న యువత పోర్న్ సైట్లు వెతుకుతుందని, వాటిని డౌన్ లోడ్ చేసుకుంటున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

దేశంలో మరే ఇతర రైల్వేష్టేషన్ల కన్నా ఎక్కువ ఫ్రీ వై-ఫై ఉపయోగిస్తున్న పాట్నా రైల్వేషన్ లో ఇంటర్నెట్ సర్చి ఉంది. అక్కడ ఎక్కువగా పోర్న్ వీడియోలు డౌన్ లోడ్ చేసుకుంటున్నారని, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలను డౌన్ లోడ్ చేసుకుంటున్నారని వెలుగు చూసింది.

పాట్నా తరువాత ఇంటర్నెట్ సర్చిలో జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. తూర్పు రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్ కిందకు వచ్చే పాట్నా రైల్వేస్టేషన్ ఉచిత వై-ఫై పొందిన మొదటి రైల్వేస్టేషన్.

 Patna tops WI-Fi use Railway stastions. Mostly for Porn

పాట్నా రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు 200కు పైగా రైళ్లు సంచరిస్తుంటాయి. దేశంలోనే ఎక్కువ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో పాట్నా కూడా ఒకటని రైల్వే అధికారులు చెబుతున్నారు. పాట్నా రైల్వే స్టేషన్ లో ఎక్కువగా యూట్యూబ్, వికీపీడియాలను చూస్తున్నారు.

అయితే అన్నిటికంటే ఎక్కువగా పోర్న్ సైట్లు చూస్తున్నారని, వాటిని డౌన్ లోడ్ చేసుకుంటున్నారని వెలుగు చూసిందని రైల్ టెల్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రైల్ టెల్ సంస్థ పాట్నా రైల్వేస్టేషన్ లో ఒక గిగాబైట్ వై-ఫై డేటాను అందిస్తోంది.

దీన్ని 10 గిగాబైట్లకు పెంచాలని రైల్ టెల్ సంస్థ భావిస్తోంది. ఉచిత ఇంటర్నెట్ కోసం యువత, ఎక్కువ మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్ కు రావడం వలన అక్కడ ఇంటర్నెట్ స్పీడు తగ్గిపోతోందని అధికారులు చెప్పారు.

దాన్ని పెంచాలని రైల్ టెల్ అధికారులు చెబుతున్నారు. బీహార్ లోని పాట్నా, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, జార్ఖండ్ లోని రాంచీతో సహ దేశంలోని 23 ప్రముఖ రైల్వేస్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు ప్రారంభించారు.

రాబోయే మూడేళ్లలో దేశంలోని అన్ని ప్రముఖ రైల్వేస్టేషన్లలో ఫ్రీ వై-ఫై సేవలు అందించాలని లక్షంగా పెట్టుకున్నామని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఈ ఏడాది చివరికి దేశంలోని 100 ప్రధాన రైల్వేస్టేషన్లలో, వచ్చే మూడేళ్లలో 400 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వై-ఫై సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.

ఇది పూర్తి అయితే ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో ఇంత పెద్ద ఎత్తున్న ఫ్రీ వై-ఫై సేవలు అందిస్తున్నది రైల్వే శాఖ (మొదటిది) అవుతుందని వివరించారు. రైల్ టెట్ సంస్థ గూగుల్ తో కలిసి రైల్వే ప్రయాణికులు ఫ్రీ వై-ఫై సేవలు అందిస్తున్నది.

English summary
More than any other railway station in the country, where free Wi-Fi service was launched, the Patna railway station is on the top in the country for using internet search.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X