బిజెపికి పవన్ ప్రచార షెడ్యూల్, మోడీ ఆఫీస్ హెలికాప్టర్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. పవన్ భారతీయ జనతా పార్టీ తరఫున కర్నాటకలో ప్రచారం చేయనున్న విషయం తెలిసిందే. పవన్ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కార్యాలయం సమన్వయం చేస్తోందట.

పవన్ పర్యటన కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో పవన్ బయల్దేరుతారు. కర్ణాటకలో బిజెపి తరపున మూడు బహిరంగ సభల్లో పాల్గొంటారని సమాచారం.

Pawan Kalyan

ఉదయం 9 నుంచి 11 వరకు రాయచూర్, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు కోలార్, 3.30 నుంచి సాయంత్ర 5 గంటల వరకు గురుమిడ్కల్‌లో ప్రచారం చేయనున్నారు. పవన్ బిజెపి తరఫున తొలిసారి ప్రచారం చేయనున్నారు.

కాగా, పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి తరపున ప్రచారం చేయాల్సిందిగా పవన్‌ను ఆహ్వానించారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానని పవన్.. అంతలోనే ప్రచారానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+