Ajit Pawar Death: షాకైన పవన్ ..! గురుద్వారా ఫొటోతో ఎమోషనల్ ట్వీట్..!

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (ajit pawar) ఇవాళ బారామతిలో జరిగిన విమాన దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు ఆయన కుటుంబానికి సంతాప సందేశాలు పంపుతున్నారు. ఇదే క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) కూడా అజిత్ పవార్ అకాల మరణంపై ఎమోషనల్ గా స్పందించారు. తాజాగా ఆయనతో భేటీ అయిన విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు, ఎన్డీయే కూటమి నాయకుడు అజిత్ దాదా పవార్ జీ ఈరోజు జరిగిన వినాశకరమైన విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఆయన అంకితభావంతో కూడిన ప్రజా సేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి చేసిన అపారమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అలాగే ప్రజల పట్ల ఆయన శాశ్వత నిబద్ధత గౌరవప్రదంగా కొనసాగుతుందన్నారు.

Pawan Kalyan Mourns Ajit Pawar Actor-Politician Recalls Their Last Gurudwara Meeting

అజిత్ పవార్ మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే ఈ అపారమైన దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కేడర్‌కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తాజాగా పవన్ తాను మహారాష్ట్ర వెళ్లినప్పుడు అజిత్ పవార్ తో కలిసి నాందేడ్ గురుద్వారాను సందర్శించిన ఫొటోల్ని కూడా జత చేశారు. ఈ మధ్యే పవన్ అక్కడికి వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో కలిసి గురుద్వారాను సందర్శించారు. అంతలోనే ఈ ప్రమాదం జరగడంతో పవన్ షాకయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+