Maharastra Polls: మహా ఎన్నికల్లో పవన్ రెండ్రోజుల ప్రచారం-బీజేపీ రిక్వెస్ట్ కు సై..!
ఈ నెల 20న జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న అధికార ఎన్డీయే కూటమి.. ఏపీలో తమ మిత్రపక్ష నేత అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం కోరింది. ముంబైలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని కోరగా.. ఆయన కూడా సరేనన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా ముంబైలో గెలుపు కీలకంగా మారిన వేళ ప్రతీ ఓటునూ సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు పవన్ ను రంగంలోకి దింపుతోంది. ఈ నెల 16, 17 తేదీల్లో ముంబైలోని తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయనతో ప్రచారం చేయించడం ద్వారా ప్రయోజనం పొందాలని కాషాయ కూటమి భావిస్తోంది. దీంతో పవన్ కూడా అందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతుగా ఆయా రాష్ట్రాలకు వెళ్తున్న పవన్ ఈసారి మహారాష్ట్రకు వెళ్లబోతున్నారు.

గతంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
జేపీ నడ్డా వంటి అగ్రనేతలను తీసుకొచ్చిన పవన్ .. అలాగే వారికి కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ సేవల్ని మహారాష్ట్రలోనూ బీజేపీ వాడుకుంటోంది. ఇప్పటికే ఏపీకి చెందిన బీజేపీ నేతల్ని మహారాష్ట్రలో ఎన్నికల పరిశీలకులుగా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఇప్పుడు పవన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.












Click it and Unblock the Notifications