పేటీఎం రీఛార్జీకి క్రెడిట్ కార్డు వాడుతున్నారా?: 2శాతం వడ్డింపు తప్పదు..
ఇకనుంచి క్రెడిట్ కార్డుతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి 2శాతం చార్జీలు తప్పవని పేటీఎం చెబుతోంది.
న్యూఢిల్లీ: బ్యాంకుల బాదుడుతో గగ్గోలు పెడుతున్న సామాన్యులకు పేటీఎం లాంటి ఆన్ లైన్ నగదు చెల్లింపు సంస్థలు సంస్థలు సైతం షాక్ ఇస్తున్నాయి. ఇకనుంచి క్రెడిట్ కార్డుతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి 2శాతం చార్జీలు తప్పవని పేటీఎం చెబుతోంది.
నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి ఎలాంటి ఛార్జీలు వర్తించవు. క్రెడిట్ కార్డుపై మాత్రమే ఛార్జీలు ఎందుకు వసూలు చేయనున్నారంటే.. క్రెడిట్ కార్డు వినియోగం ద్వారా పేటీఎం రీఛార్జీ చేసి చాలామంది వాటిని బ్యాంకు ఖాతాకు జమచేసుకుంటున్నారు.

దీంతో ట్రాన్సాక్షన్ కాస్ట్ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో పాటు.. దానికి క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ కూడా ఉంది. దీంతో క్రెడిట్ కార్డు సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయాలని పేటీఎం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications