వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెగాసస్ నిఘా కుట్ర: ఇజ్రాయెల్‌లో హైడ్రామా -టెక్ సంస్థ ఎన్ఎస్ఓ ఆఫీసుల్లో తనిఖీలు -భారత్ ఒత్తిడితో!

|
Google Oneindia TeluguNews

పెగాసస్ నిఘా కుట్ర ఉదంతానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'పెగాసస్‌' నిఘా సాఫ్ట్‌వేర్‌ ను తయారు చేసిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ కార్యాలయాలపై ఇజ్రాయెల్‌ అధికారులు దాడులు నిర్వహించారు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రపంచ వ్యాప్తంగా దుర్వినియోగమవుతున్నదని జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్టియం ఆరోపించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ

ఇజ్రాయెల్ ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన పలు దర్యాప్తు సంస్థల అధికారులు టెల్ అవివ్ సమీపంలోని హెర్జిలియాలో ఉన్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం ట్వీట్‌ చేసింది. పెగాసస్‌ స్పైవేర్‌తో మొబైల్‌ ఫోన్స్‌ హ్యాకింగ్‌కు సంబంధించి ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు, సంబంధిత ప్రచురణలను పరిశీలించినట్లు పేర్కొంది. కాగా,

Pegasus spyware row: Israel govt officials raids NSO offices

ఇజ్రాయెల్ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయాన్ని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ప్రతినిధులు తమ కార్యాలయాన్ని సందర్శించారని, ఈ తనిఖీలను తాము ఆహ్వానిస్తున్నామని సైబర్ సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులతో పూర్తి పారదర్శకతతో పనిచేస్తున్నట్లు తెలిపింది. నిఘా ఆరోపణలను ఎన్‌ఎస్‌ఓ సంస్థ ముందునుంచీ ఖండిస్తూ వస్తుంండటం తెలిసిందే. అయితే,

hyderabad: ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్ -లోపల ఉప్పల్ ఎమ్మెల్యే, బోడుప్పల్ మేయర్ -ప్రమాదంలో..hyderabad: ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్ -లోపల ఉప్పల్ ఎమ్మెల్యే, బోడుప్పల్ మేయర్ -ప్రమాదంలో..

పెగాసస్ నిఘా కుట్రకు సంబంధించి స్పైవేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ కార్యాలయంలో ఇజ్రాయెల్‌ రక్షణ అధికారుల తనిఖీలు కేవలం తూతూ మంత్రంగా జరుగుతున్నాయని ఇజ్రాయెల్ కే చెందిన కాల్కలిస్ట్ అనే పత్రిక పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు ఎన్‌ఎస్‌ఓకు మధ్య చీకటి ఒప్పందాలు ఉండొచ్చని, గతంలో కూడా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఆ సంస్థపై వచ్చిన విమర్శలు, న్యాయ వివాదాలను తమ అధికారంతో నిలువరించారని ఆ పత్రిక వెల్లడించింది.

Recommended Video

Israel-Hamas ఇజ్రాయెల్‌ VS పాలస్తీనా యుద్దానికి తాత్కాలిక బ్రేక్ | Palestinians | Oneindia Telugu

భారత్ లోని విపక్ష పార్టీలు, పలు రంగాల ప్రముఖులపై కేంద్రం పెగాసస్ ద్వారా నిఘాకు పాల్పడిందనే అంశం ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తున్నది. నిఘా కుట్ర జరగలేదని కేంద్రం వాదిస్తుండగా, దర్యాప్తు చేసి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుపడుతున్నాయి. భారత్ లో జరుగుతోన్న ఆందోళనల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎన్ఎస్ఓ ఆఫీసులో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

English summary
The cybersecurity firm NSO Group on Thursday confirmed the inspection of its offices by Israeli authorities and said the company was “working in full transparency” with the representatives from Israel probing into the Pegasus snooping row. In a statement to India Today on Thursday, a spokesperson for NSO said, “We can confirm that representatives from the Israeli Ministry of Defence visited our offices. We welcome their inspection. The company is working in full transparency with the Israeli authorities.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X