డాక్టర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్, అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా లీడర్ జంప్ !
అధికార పార్టీకి చెందిన నాయకుడు, ప్రముఖ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో అదే పార్టీకి చెందిన మరో నాయకుడు పారిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని రోణా తాలూకాలోని హిరేహాల గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ హట్టి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్జాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శరణ్‌గౌడ్ పాటిల్ అరెస్ట్ విషయంలో పోలీసులు మీనమేషాలు ఆడుతున్నారని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ శశిధర్ ఆత్మహత్య చేసుకుని నాలుగు రోజులు గడిచినా నిందితుడు శరణ్ గౌడను అరెస్ట్ చేయలేదు. శరణ్ గౌడ దాక్కున్నాడంటూ ఆరా తీస్తున్న పోలీసుల చర్యలు పలు అనుమానాలకు తావిస్తోందని సొంత పార్టీకి చెందిన నాయకులు, శశిధర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రభావం వల్లనో, స్థానిక ఎమ్మెల్యేకు అత్యుంత సన్నిహితుడు అయిన నాయకుడు కావడం, డబ్బు, అధికారం ఉన్న వ్యక్తి కావడం వలనే శరణ్ గౌడను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించలేదని శశిధర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

నిందితులను అరెస్టు చేసేందుకు ఇంకా ఎంత సమయం కావాలి ? అని డాక్టర్ శశిధర్ కుటుంబ సభ్యులు, బందువులు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తోందని గదగ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆరోపించడం ఇఫ్పుడు కర్ణాటకలోని అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శశిధర హట్టి రాసిన డెత్ నోట్ లో శరణ్ గౌడ్ పాటిల్ పేరును ప్రస్తావిస్తూ శరణ్ గౌడ్ వేధింపులే నా చావుకు కారణమని పేర్కొన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో శరణ్‌గౌడ ప్రధాన నిందితుడుని వివరించారు.
అయితే డాక్టర్ శశిధర్ ఆత్మహత్య చేసుకుని నాలుగు రోజులు గడుస్తున్నా నిందితుడు శరణ్ గౌడను అరెస్ట్ చేయకపోవడం హిరేహ వాసులను ఆగ్రహానికి గురిచేస్తోంది.
డాక్టర్ శశిధర్ ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యం మొత్తం బయటపెట్టిన ఆయన డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక మాఫియా వ్యాపారంలోని చీకటి కోణాలు బట్టబయలు చేసిన డాక్టర్ శశిధర్ ఆత్మహత్య చేసుకోవడం కలకం రేపింది.

డాక్టర్ శశిధర్ ఆత్మహత్యతో పోలీసులు, కొంతమంది ప్రభావంతమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారని, అందుకే శరణ్ గౌడను అరెస్టు చెయ్యకుండా కాలం గడుపుతున్నారని గదగ్ జిల్లాకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. నిందితుడు శరణ్‌గౌడ అరెస్ట్‌లో జాప్యం జరుగుతుండడంతో పలు రకాల ప్రశ్నలు ప్రజలను వేధిస్తున్నాయి.
కర్ణాటకలో
అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అందుకే నిందితులకు రక్షణగా నిలవడంతో పోలీసులు నిస్సహాయస్థితిలో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా పరారీలో ఉన్న నిందితుడు శరణ్ గౌడ్ పాటిల్ గుర్తు తెలియని ప్రదేశంలో దాక్కొని కర్ణాటక హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications