బెంగళూరులో పోలింగ్ బహిష్కరణ, ఓటింగ్ అంటే ఊడిపోతుంది, ఈగలు తోలుకున్న సిబ్బంది!
లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఎంత మంది ఓటు వేస్తే అంత శాతం ఓటింగ్ పెరుగుతుందని అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే స్థానికుల దెబ్బకు ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ నాయకులకు సినిమా కనపడింది. మా డిమాండ్లు తీరే వరకు ఓటు వెయ్యమని ఆ ఏరియా ప్రజలు సామూహికంగా ఎన్నికల పోలింగ్ ను బహిష్కరించారు.
బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గంలోని శివపురి కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు శుక్రవారం పోలింగ్‌ను బహిష్కరించారు. ఇక్కడి సమస్యలు పరిష్కరించే వరకు ఓటు వేయబోమని ఓటర్లు తేల్చి చెప్పారు. టి దాసరహళ్లి పరిధిలోని శివపురి కాలనీలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఒక్కరు కూడా ఓటు వెయ్యలేదు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా ఓటు వేయకపోవడంతో ఆ ప్రాంతంలోని ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు.

శివపురిలో ఎక్కువ మంది దళితులు నివసిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు. సౌకర్యాలు కల్పించే వరకు ఓటేయబోమని ఖచ్చితంగా చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే ఇంటి ముందు కుక్కల్లా మొరిగినా ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇక్కడకి అభ్యర్థులు వస్తారు, పోతారని, ఓటు వేయాలని వారు మమ్మల్ని అభ్యర్థిస్తున్నారని, ఓట్లు వేసిన తరువాత ఇటువైపు కన్నెత్తికూడా చూడరని. మా సమస్యలను కూడా వినరని ప్రజలు ఆరోపించారు.
కానీ మా సమస్యలు మాత్రం ఇంత వరకు పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆరోపించారు. వేసవిలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుందని, నీటి ట్యాంకర్లు కూడా ఇక్కడికి రావని, మూడు రోజులకు ఒకసారి కావేరీ నీటిని విడుదల చేస్తే పెద్ద విషయమే అని, ఆ నీటిని వారం రోజుల పాటు ఉంచితే పురుగులు వస్తాయని, ఆ నీటిని మేము ఎలా వాడాలి అని ప్రజలు ప్రశ్నించారు. పలుమార్లు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లామని, కానీ ప్రయోజనం లేదు అని శివపురి కాలనీ ప్రజలు ఆరోపించారు.
ఈ ప్రాంతంలో నీరు సమస్య ఒక్కటేకాదని, విద్యుత్తు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉందని, కరెంటు లేకుండా ఎలా బతకాలి? మేము ఎలా జీవిస్తాము? అని ప్రజలు ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయ నాయకులు మేము ఎలా ఓటు వేస్తాము, ఎందుకు ఓటేస్తాం? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ జరగనప్పటికీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి మీ సమస్యలు ఏమిటి అని అడగలేదని, కనీసం మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదని ప్రజలు మండిపడ్డారు.
అందుకే సాయంత్రం నాలుగు గంటలు వరకు ఇక్కడి ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. కర్ణాటకలోని చిత్రదుర్గలో కూడా ఓటింగ్ బహిష్కరించారు. చిత్రదుర్గంలోని సిద్దాపూర్ గ్రామంలోని 76వ పోలింగ్ బూత్ లో ఓటింగ్ జరగలేదు. ఎందుకంటే ఇక్కడి ఓటర్లు వివిధ డిమాండ్లను ముందుంచారు, డిమాండ్లు నెరవేరితేనే ఓటేస్తామని పట్టుబట్టారు. ఈ ప్రాంతంలో సుమారు 500 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. అయితే మధ్యాహ్నాం గడిచినా ఇక్కడి ప్రజలను నాయకులు నమ్మించే ప్రయత్నాలు చేయలేదు.












Click it and Unblock the Notifications