త్రిశూర్ కు పోటెత్తిన భక్తులు..

తిరువనంతపురం: కేరళలోని త్రిశూర్ జిల్లా ఆదివారం ఉదయం భక్తులతో పోటెత్తింది. భక్తుల రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండని కుజిక్కాట్టుసేరి ఒక్కసారిగా వందలాది మంది భక్తులతో నిండిపోయింది. దీనికి కారణం.. మరియం థ్రెసియస్. ఆమె సమాధి స్థానిక చర్చిలో ఉండటం. కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెసియస్ కు అత్యున్నతమైన సెయింట్ హుడ్ హోదా లభించడంతో ఆమె సమాధిని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు కుజిక్కాట్టుసేరికి చేరుకుంటున్నారు. కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలతో ఈ ప్రాంతం జాతరను తలపిస్తోంది.

త్రిశూర్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పట్టణం. ఇక్కడి చర్చిలో మరియం థ్రెసియస్ సమాధి ఉంది. ఆమెకు సెయింట్ హుడ్ హోదా ఇస్తున్నట్లు వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించిన వెంటనే.. ఈ పట్టణానికి భక్తులు పోటెత్తారు. వందలాది మంది భక్తులు మరియం సమాధిని సందర్శించారు. ఆదివారం కావడంతో చర్చిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సమాధి వద్ద నివాళి అర్పించారు. కేరళ నుంచి ఓ క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హుడ్ హోదా లభించడం ఇదే తొలిసారి కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 People gather at the shrine of Mother Mariam Thresia at Kuzhikkattussery in Thrissur

కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం థెరిసాకు ప్రఖ్యాత సెయింట్ హోదా లభించింది. క్రైస్తవ మతంలో అత్యున్నతమైన హోదా ఇది. ఈ విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ప్రకటించారు. ఇకపై ఆమెను దేవ దూతగా భావించాలని సూచించారు. ఈ ఉదయం వాటికన్ సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రకటన చేశారు. మరియం థామస్ తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో అయిదుమందికి సెయింట్ హుడ్ హోదా లభించింది. ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీథరన్ హాజరు అయ్యారు.

 People gather at the shrine of Mother Mariam Thresia at Kuzhikkattussery in Thrissur

మరియంతో పాటు వివిధ దేశాలకు చెందిన మరో నలుగురికి సెయింట్ హుడ్ హోదాను ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిటన్ కు చెందిన కార్డినల్ జాన్ హెన్రీ న్యూమన్, స్విట్జర్లాండ్ కు చెందిన మార్గరెట్ బేస్, బ్రెజిలియన్ సిస్టర్ డల్స్ లోపెస్, ఇటాలియన్ సిస్టర్ గుసెప్పినా వాన్నినీలకు సెయింట్ హుడ్ హోదా లభించింది. క్రైస్తవ మత ఆచారాల ప్రకారం సెయింట్ హుడ్ హోదా లభించాలంటే అనేక పరీక్షలు, నిబంధనలు ఉంటాయి. వారి హయాంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటే గానీ.. ఈ అత్యున్నతమైన సెయింట్ హుడ్ హోదా లభించింది. ఇదివరకు ఈ హోదా మదర్ కు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+