Chandrayaan 3: తొడ కొట్టిన చంద్రయాన్ 3, మీసం తిప్పిన విక్రమ్, ఒక్కమగాడు అంటే!
బెంగళూరు/తిరుపతి: 140 కోట్ల మంది భారతీయుల కలలను నిజం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు భారతీయులు నీరాజనం పడుతున్నారు.చంద్రయాన్-3 విజయవంతం కావడంతో భారతదేశం గురించి ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి దూసుకుపోయిన చంద్రయాన్- 3 లోని విక్రమ్ రోవర్ చందమామను ముద్దు పెట్టుకోవడంతో ప్రపంచ దేశాలు భారత్ గురించి చర్చించుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి తొడ కొట్టి నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్- 3 విజయవంతం కావాలని ప్రతి భారతీయుడు ఆశపడ్డాడు. తిరుమల శ్రీవెకంటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రయాన్- 3 విజయంవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి.

బుదవారంయ సాయంత్రం 6. 04 గంటలకు విక్రమ్ ల్యాండ్ అయ్యింది. చంద్రుడి దక్షణి ద్రువం మీద విక్రమ్ అడుగుపెట్టడంతో ప్రపంచ దేశాలకు భారత్ సవాలు విసిరింది. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులు కలిగిన అమెరికా, రష్యా, చైనా సైతం సాధించలేదని ఘనత ఇప్పుడు భారత్ సాధించింది. ఇంత వరకు అమెరికా, రష్యా, చైనా చంద్రుడి దక్షిణ ద్రువం మీద వ్యోమనౌకను సురక్షితంగా దించలేకపోవడంతో ఇప్పుడు భారత్ తన సత్తా చాటుకుని విక్రమ్ ల్యాడర్ ను సురక్షితంగా దించింది.
చంద్రయాన్ -3 విజయవంతం కావడంతో ఐటీ హబ్ బెంగళూరులోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇస్రోకు, బెంగళూరుకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సాంకేతిక పరంగా బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తల సహకారం చంద్రయాన్-3కి ఉన్నాయి. బెంగళూరు నగరంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, హెచ్ఏఎల్ ఉద్యోగులు, పలు రంగాలకు చెందిన వ్యాపారులు సైతం చంద్రయాన్-3 విజయవంతం కావడంతో సంబరాలు చేసుకున్నారు.

బుధవారం రాత్రి 7 గంటల వరకు బెంగళూరులోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. చంద్రయాన్-3 భారతీయులు ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకుని నిలబడేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. ఇస్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు, ప్రతిఒక్క ఉద్యోగితో పాటు ఆఫీస్ బాయ్ వరకు చంద్రయాన్ -3 విజయవంతంలో భాగం అయ్యారని ప్రజలు సంతోషంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications