అయ్యప్ప మాలలు వేసుకుని ఐటీ హబ్ ట్రస్టు పేరుతో ఏం చేస్తున్నారంటే ?, ఫోన్ నెంబర్ తో !
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయ్యప్ప మాలలు వేసుకుంటున్న భక్తులు కేరళలోని శబరిమలకు వెళ్లి శ్రీయప్పస్వామిని దర్శించుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది అయ్యప్పమాలలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం కేరలలోని పతనం తిట్టలో అయ్యప్ప దేవాలయం తీసి ఉండటంతో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి వస్తున్నారు.
అయ్యప్పమాలలతో పాటు ప్రస్తుతం ఓం శక్తి, దుర్గాశక్తి, గోవిందమాల, హనుమాన్ మాలలు వేసుకుంటున్న భక్తులు ఆయా దేవుళ్లకు మొక్కలు తీర్చుకుంటున్నారు. అయ్యప్ప మాలలు వేసుకుంటున్న భక్తులు కొంత మంది భిక్షం ఎత్తుకుని శబరిమలకు వెళితే పుణ్యం వస్తుందని, చేసిన పాపాలు పోతాయని నమ్ముతుంటారు. శబరిమలకు వెళ్లడానికి కొందరు అయ్యప్ప మాలలు వేసిన భక్తులు నిధులు సమకూర్చుకోవడానికి భిక్షం ఎత్తుకుంటున్నారు.

అయ్యప్ప మాలలు వేసుకుని విరాళాలు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నకిలీ అయ్యప్ప మాలలు వేసిన కొందరనిని ప్రజలు పట్టుకున్న ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకా నిడ్లే గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మస్థలం పోలీస్ స్టేషన్ లో నిందితుల మీద కేసు నమోదు అయ్యింది. కొందరు యువకులు ప్రజలను మోసం చేస్తున్నారని వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన స్వామి వివేకానంద సోషల్ సర్వీస్ ట్రస్ట్ (రిజిస్టర్) పేరుతో నిందితులు దక్షిణ కన్నడ జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇప్పటికే నిందితులు చాలా మంది నుంచి విరాళాలు సేకరించారు. నిడ్లే గ్రామానికి చెందిన ధనుష్‌ను విరాళం అడగగా అతనికి అయ్యప్ప మాలలు వేసుకున్న యువకులు మీద అనుమానం వచ్చింది. వెంటనే ధనుష్ నిందితులు నిర్వహిస్తున్న ట్రస్టుకు సంబంధించిన సమాచారం అడిగాడు. ధనుష్ నిందితులు చెప్పిన ఆ సంస్థకు చెందిన మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసి ఆరా తీశాడు.

అంతేకాకుండా స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజల సహకారంతో నకిలి అయ్యప్ప మాలలు వేసుకుని ప్రజలను మోసం చేస్తున్న యువకులను పట్టుకున్నారు. సంఘటనా స్థలంలో నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మోసం కేసుకు సంబంధించి కేసులు నమోదు చేశారు. ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో నిందితుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications