Bihar Exit Polls.. క్లీన్ స్వీప్ సాధించేది ఆ కూటమే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఆయా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీహార్ పై తమ అంచనాలను వెల్లడించాయి. ఇందులో మెజారిటీ ఎన్డీఏ కూటమికే పట్టం కట్టాయి. మొత్తం నాలుగు ఎగ్జిట్ పోల్స్- మాట్రైజ్, పీపుల్స్ ఇన్‌సైట్, దైనిక్ భాస్కర్, పీపుల్స్ పల్స్.. అధికార జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ కూటమికి భారీ విజయం ఖాయమని అంచనా వేశాయి.
ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీ, ఈ ఎన్నికలతోనే అరంగేట్రం చేసింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకి నిరాశాజనకమైన ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పాయి. రెండో దశలో 67.14 శాతం పోలింగ్ నమోదైంది. నితీష్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులతో సహా 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3.7 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడం బీహార్ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగనుంది.

గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) 43 స్థానాలకు పడిపోయిన విషయం తెలిసింద. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే 25 స్థానాలకు పైగా కోల్పోయింది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ తిరుగుబాటు కారణంగానే ఇది సంభవించింది. ఇప్పుడు మాత్రం దీన్ని అధిగమించింది జేడీయూ. ఈ సారి పాశ్వాన్ పార్టీ ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ కావడం కలిసొచ్చింది. ఎన్డీఏలో కీలక భాగస్వామి అయింది.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 133 నుంచి 159 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమికి 75 నుంచి 101 సీట్లు వస్తాయని పేర్కొంది. మేట్రిజ్ అంచనా ప్రకారం.. ఎన్డీఏకు 147 నుంచి 167 స్థానాలు లభిస్తాయి. మహాకూటమి 70 నుంచి 90 స్థానాలకు పరిమితం కావొచ్చు. ఎన్డీఏ 133 నుంచి 148 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని పీపుల్స్ ఇన్ సైట్ అభిప్రాయపడింది. మహా కూటమి 87- 102 సీట్లు దక్కే అవకావం ఉంది.












Click it and Unblock the Notifications