Viral News: బీహార్‌లో వండర్ కిడ్ వైరల్ వీడియో.. 18 ఏళ్లకే IPS.. UPSC ఎగ్జామ్ రాయకుండానే పోస్టింగ్
Fake IPS: ఇండియాలో IAS, IPS ఉద్యోగులను అత్యున్నత స్థాయి వ్యక్తులుగా భావిస్తారు. ఎందుకంటే UPSC నిర్వహించే పరీక్షలో నెగ్గి, ఆ బాధ్యతలను నిర్వర్తించడం అంత తేలిక కాదు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, శిక్షణ వంటి పలు రకాల కష్టతరమైన ఫేజ్‌లను దాటాల్సి ఉంటుంది. అయితే కొందరు దుండగులు మాత్రం అమాయకులకు గాలం వేసి మోసాలు చేయడంలో ఆరితేరిపోతున్నారు. ఏకంగా ఆల్ ఇండియా స్థాయి ఉద్యోగాలు డైరెక్టుగా ఇప్పిస్తామంటూ నట్టేట ముంచుతున్నారు.
కష్టతరమైన UPSC పరీక్షలను క్లియర్ చేయడానికి వేలాది మంది అహోరాత్రులు శ్రమిస్తుండగా, బీహార్‌కు చెందిన ఓ 18 ఏళ్ల బాలుడు మాత్రం చాలా తేలికగా IPS అయిపోయాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరుకాకుండానే ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో భాగంగా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. మిథిలేష్ కుమార్ అనే యువకుడు పోలీస్ యూనిఫాం మరియు పిస్టల్‌తో IPS అధికారిగా హల్‌చల్ చేశాడు.

బీహార్‌లోని జముయి జిల్లాలో తిరుగుతున్న ఈ నకిలీ IPS అధికారి.. యూనిఫాం మరియు తుపాకీతో తిరగడాన్ని పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. విచారణలో తాను IPS అధికారిని అని, 2 లక్షలు ఇచ్చి ఈ ఉద్యోగం కొనుగోలు చేశానని చెప్పి పోలీసులకు షాక్ ఇచ్చాడు. మనోజ్ సింగ్ అనే వ్యక్తి తన వద్ద నుంచి 2 లక్షలు తీసుకుని, తాను ఇకపై IPS అధికారి అయినట్లు చెప్పాడని మిథిలేష్ వెల్లడించాడు.యూనిఫాం మరియు తుపాకీ కూడా అతడే ఇచ్చినట్లు తెలిపాడు.
18 ఏళ్ల బాలుడు సడెన్‌గా IPS అయ్యానంటూ యూనిఫాం ధరించి తిరగడం చూసి గ్రామస్థులు షాక్‌కు గురైనట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మిథిలేష్‌కు సంబంధించిన వీడియోను నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో Xలో షేర్ చేసింది. స్టేషన్‌కు తీసుకెళ్లిన అనంతరం 'రండి సార్, సికందర పోలీస్ స్టేషన్‌కు మీకు స్వాగతం' అంటూ పోలీసులు సంభోధించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
बिहार के जमुई में बिना UPSC पास किए 18 साल का लड़का बन गया आईपीएस। पुलिस ने पूछा तो बोला- ‘मैं तो IPS हूं’ फिर जो हुआ, देखिए वीडियो। #FakeIPS pic.twitter.com/PFoQbzVo6G
— NCIB Headquarters (@NCIBHQ) September 20, 2024
ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ మందికి పైగా వీక్షించారు.సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. 18 ఏళ్ల వ్యక్తి 2 లక్షలు ఎలా సంపాదించాడు అని ప్రశ్నించాలని ఒకరు సూచించారు. అసలు నేరస్థుడిని పట్టుకోవడాన్ని పక్కన పెట్టి అమాయకులను నిర్బంధించి రికార్డ్ చేయడం, వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం మాత్రమే ఇండియన్ పోలీసుల పని అని మరొకరు కామెంట్ చేశారు. అమాయకులను మోసం చేస్తున్న ప్రధాన నిందితులను పట్టుకోవడంపై పోలీసులు దృష్టి సారించాలని మూడో వ్యక్తి సూచించారు.












Click it and Unblock the Notifications