Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ నిర్ణయంతో షాకయ్యా! కరుణ అంత్యక్రియలపై వెంటనే మోడీకి ఫోన్ చేశా: మమత బెనర్జీ

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరిపేందుకు మొదట రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి తాను వ్యక్తిగతంగా షాకయ్యానని, వెంటనే ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు.

'మెరీనా బీచ్‌లో కరుణానిధి అంతిమ సంస్కారాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిసి, నేను నిన్న చాలా బాధపడ్డాను. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడటానికి ఫోన్ చేశాను. కానీ, ఆయన అందుబాటులో లేరని ఆయన సిబ్బంది చెప్పారు. దీంతో నేను ఈ విషయంపై మాట్లాడడానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశాను' అని మమతా బెనర్జీ మీడియాకు తెలిపారు.

Personally Called PM Modi For Karunanidhis Beach Burial: Mamata Banerjee

మంగళవారం సాయంత్రం 6.10గంటలకు కరుణానిధి మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే మమతా బెనర్జీ మంగళవారం రాత్రే చెన్నైకి చేరుకున్నారు. కరుణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా, బుధవారం కరుణానిధి అంత్యక్రియలకు తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ హాజరుకానున్నారు.

కాగా, కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లో జరిపేందుకు మొదట ప్రభుత్వం అంగీకరించకపోయినప్పటికీ మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరుగుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+