Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరు కామాంధుల నుంచి బాలికను కాపాడిన పెంపుడు కుక్క

భోపాల్: ఓ బాలికను ఆమె పెంపుడు కుక్క కామాంధుల నుంచి కాపాడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసింది. రేపిస్టులను కరిచి వారు అక్కడి నుంచి పారిపోయేలా చేసింది పెంపుడు శునకం.

సాగర్ జిల్లా కరీలా గ్రామానికి చెందిన ఓ బాలిక గత శుక్రవారం రాత్రి పని ఉండి బయటకు వెళ్లింది. బాలిక ఒంటరిగా రావడం గమనించిన ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించారు. కత్తితో బెదిరించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు.

Pet Dog Rescues Girl From Rapists in MP Sagar: Accused Booked

ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. అయితే బాలిక అరుపులు విన్న పెంపుడు కుక్క ఘటనాస్థలికి వెళ్లి నిందితులపై దాడి చేసింది. ఆ తర్వాత ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి పరుగెత్తికి వచ్చింది. కుక్క అరవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులు.. మైనర్ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న పశువుల దాణా గదికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. శునకం వచ్చి వారిని కరవడమే కాకుండా, అరిచింది. దీంతో స్థానికులు అక్కడకు వచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+