గట్టిగా హగ్ ఇస్తా, గాఢమైన ముద్దిస్తా: ఇంద్రాణికి పీటర్

ముంబై: షీనా బోరా హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న పీటర్ ముఖర్జీయా తన సతీమణి ఇంద్రాణి ముఖర్జియాకు (ఈమె కూడా జైలులో ఉంది) ఆమె పుట్టిన రోజు సందర్భంగా గత జనవరి నెలలో ఓ లేఖ రాశాడు. ఆయన అందులో ప్రేమ కురిపిస్తూ లేఖ రాశాడు.

నిన్ను గట్టిగా హత్తుకుంటానని, అలాగే, గాఢమైన ముద్దు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. షీనా బోరా హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటర్ ముఖర్జియా, ఇంద్రాణిలు జైలులో ఉన్నారు.

జనవరి నెలలో ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పీటర్ ఆమెకు లేఖ రాశాడు. నీవు ఏదో ఒకరోజు నీ అమాయకత్వాన్ని నిరూపించుకోగలవని, నేను కూడా నీ తరఫున ప్రార్థిస్తున్నానని, ఈ పీడకల నిన్ను వదిలి మంచి రోజు నీకు వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నాడు.

Peter Mukerjea sends wife Indrani big hug, birthday wishes

ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే ఒకరినొకరు పలకరించుకుంటున్నారని, జనవరిలో ఆమె పుట్టిన రోజున స్వీట్లు కూడా తినిపంచుకున్నారని తెలుస్తోంది. ఆయన స్వయంగా తన చేతి రాతతో జనవరి 3న లేఖ రాశాడని తెలుస్తోంది.

అందులో... 'మై డియరెస్ట్.. ఈ రోజు నీ జీవితంలో ప్రత్యేకమైన రోజు. నాకైతే ఇంకా చాలా ప్రత్యేకం. మనం కలిసినప్పటి నుంచి నీ ప్రతి పుట్టిన రోజును కలిసే జరుపుకున్నాం. కానీ ఈ ఏడాది మాత్రం చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఎంతో దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. దేవుడు చాలా గొప్పవాడు.

దీనికి త్వరలోనే ముగింపును ఇస్తాడు. మనిద్దర ఎం చక్కా రోమియో జూలియట్‌లా త్వరలో కలిసి తిరుగుతాం. అది కోర్టు ప్రాంగణం కావొచ్చు.. నివాసం కావొచ్చు. నీకు ఎదురైనప్పుడు మాత్రం బాధ మొత్తం పోయేలా మంచి సంతోషం ఇస్తాను. నీ పుట్టిన రోజు సందర్భంగా సంక్షిప్త లేఖ ద్వారా నిన్ను ఇలా చేరుకుంటున్నాను. కానీ నీ రోజంటూ వచ్చిన తర్వాత ఒక గట్టి కౌగిలి, గాఢమైన ముద్దు ఇస్తా'నని రాశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+