నో కాంప్రమైజ్: విజయవాడలో నూటొక్కటి..హైదరాబాద్‌లో నూటికి: అక్కడ రూ.106 క్రాస్: జనం గగ్గోలు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరలను పెంచడంలో చమురు సంస్థలు ఏ మాత్రం రాజీధోరణి కనపర్చట్లేదు. వాహనదారులపై కారుణ్యాన్ని కురిపించట్లేదు. పైగా మరింత రాటుదేలుతున్నాయి. కరకుగా మారుతున్నాయి. రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలను యథేచ్ఛ పెంచుకుంటూ పోతోన్నాయి. వాహనదారుల మీద భారాన్ని మోపుతూనే ఉన్నాయి. బుధవారం కూడా వాటి ధరల్లో పెరుగుదల కనిపించింది.

తాజాగా పెంపుతో విజయవాడలో పెట్రోల్ రేటు 101 రూపాయలను దాటేసింది. హైదరాబాద్, విశాఖపట్నంలల్లో నూటికి చేరువైంది. ముంబై సహా పలు నగరాల్లో పెట్రోల్ ధర వంద రూపాయల మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శనివారం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 19 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.95.56, డీజిల్ 86.47 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 101.76 రూపాయలు ఉంటోంది.

Petrol and Diesel Price again hiked on June 9 2021, prices here for Hyderabad, Vijayawada

డీజిల్‌ ధర 93.85 పైసలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 101 రూపాయల మార్క్‌ను దాటింది. లీటర్ పెట్రోల్ 101.52 రూపాయలు పలుకుతోంది. విశాఖపట్నంలో పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటింది. అక్కడ రూ.100.49 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు నూటికి చేరువైంది. లీటర్ పెట్రోల్ రూ. 99.31 పైసలు పలుకుతోంది. డీజిల్ 94.26 రూపాయలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 96.94, డీజిల్‌ ధర రూ. 91.15, కోల్‌కతలో పెట్రోల్ రూ.95.52 పైసలు, డీజిల్‌ ధర రూ.89.32 పైసలు పలుకుతోంది.

పుణేలో పెట్రోల్ రూ.101.37, డీజిల్ 92.03, బెంగళూరులో పెట్రోల్-98.75, డీజిల్-91.67, చండీగఢ్‌లో పెట్రోల్-91.91, డీజిల్-86.39, లక్నోలో పెట్రోల్-92.81, డీజిల్-86.87గా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్-103.75, డీజిల్-95.05 రూపాయలకు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ధర రికార్డు నెలకొల్పింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 106.64 రూపాయలకు చేరింది. డీజిల్ 99.50 పైసలు ఉంటోంది. జైపూర్‌లోనూ 102 రూపాయలను దాటేసింది పెట్రోల్ రేటు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Recommended Video

    #TOPNEWS: #Krishnapatnam Medicine | Producer BA Raju | CHINA | Air India || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+