ఆయిల్ కంపెనీల దండయాత్ర: డాలర్‌తో రూపాయి మారకం విలువ పాతాళానికి..
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమనబోతోన్నాయి. దీనికి అనుకూల వాతావరణం నెలకొంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ పోలింగ్ ముగియడం.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరంభమైన అనంతరం అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకడం వంటి పరిణామాల మధ్య ఇక చమురు కంపెనీలు వాహనదారులపై దండయాత్ర చేయడానికి సమాయాత్తమౌతోన్నాయి. ఈ వారంలోనే దీనికి ముహూర్తాన్ని నిర్ధారించడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.
Recommended Video

140 డాలర్లకు బ్యారెల్..
క్రూడాయిల్ ధర కూడా ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. బ్యారెల్ ఒక్కింటికి 140 డాలర్లను టచ్ చేసింది. 2008 తరువాత ఈ స్థాయిలో ముడిచమురు రేటు పెరగడం ఇదే తొలిసారి. బ్రెంట్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ఒక్కింటికి 139.13 డాలర్లను తాకింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైనప్పటి నుంచీ క్రూడాయిల్ బ్యారెల్ రేటు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడది గరిష్ఠానికి చేరింది. అదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77 రూపాయలకు క్షీణంచడం అదనపు భారం పడినట్టయింది.

దిగుమతులే ఆధారం..
దీని ప్రభావంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. భారత్.. 90 శాతం మేర పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు క్రూడాయిల్ దిగుమతి అవుతోంది ప్రధానంగా. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆరంభమైన తరువాత షిప్పింగ్ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల సౌదీ అరేబియా ఇటీవలే తన రేట్లను సవరించిన విషయం తెలిసిందే.

సౌదీ ప్రభావం..
ఆసియా దేశాలకు సరఫరా చేసే ముడిచమురు బ్యారెల్ ధరను సౌదీ అరేబియా భారీగా పెంచింది. ఫలితంగా- ఆసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రావడం దాదాపుగా ఖాయమైంది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, రవాణా, షిప్పింగ్ సమస్యలు తలెత్తడం వల్ల వాటి రేట్లను పెంచాల్సి వచ్చిందని ఆరామ్‌కో తెలిపింది. అఫీషియల్ సెల్లింగ్ ప్రైస్ (ఓఎస్పీ) పెంచినట్లు పేర్కొంది. బ్యారెల్ ఒక్కింటికి అరబ్ లైట్ క్రూడ్ ధర 4.95 డాలర్లకు పెంచింది.

ఆసియన్ దేశాల్లో..
అమెరికా, వాయవ్య యూరోప్, మిడ్ టెర్రయిన్ రీజియన్లకు సౌదీ అరేబియా ముడిచమురును సరఫరా చేస్తోంది. ఇందులో సూపర్ లైట్, ఎక్స్‌ట్రా లైట్, లైట్, మీడియం, హెవీ రకాలుగా క్రూడ్‌ను విభజించింది. వాటన్నింటి రేట్లను కూడా సవరించినట్లు ఆరమ్‌కో తెలిపింది. ఒక్కో రకానికి.. ఒక్కో రేటును నిర్దేశించిందా సౌదీ అరేబియా స్టేట్ ఓన్డ్ ఆయిల్ కంపెనీ. ఇది కూడా భారత్ పెట్రో మార్కెట్‌ను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

దీపావళి తరువాత..
గత ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానికి ఎగబాకడం ఆరంభమైన విషయం తెలిసిందే. ఒకదశలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 120 రూపాయలకు వెళ్లింది. దీపావళి పండగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 5, డీజిల్‌పై 10 రూపాయల మేర కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. ఫలితంగా వాటి ధరలు కాస్త శాంతించాయి. ఇప్పుడు దాన్ని సవరించడం ఖాయమైంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications