ఠారెత్తిస్తోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు: మళ్లీ పెంపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం పెరిగాయి. ఇవ్వాళ కూడా వాటి రేట్లను పెంచాయి చమురు సంస్థలు. లీటర్‌ ఒక్కింటికి 35 పైసల మేర వాటి రేట్లను సవరించాయి. లీటర్‌కు 35 పైసల మేర ఇంధన ధరలను పెంచడాన్ని ఈ మధ్యకాలంలో ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ఫలితంగా- మూడురోజులకోసారి ఈ రెండింటిపైనా రూపాయికి పైగా భారం పడుతోంది. ఇంధన ధరలను పెంచే విషయంలో చమురు సంస్థలు ఏ మాత్రం వెనుకాడట్లేదు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారాన్ని మోపుతూనే ఉన్నాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌‌, డీజిల్‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నట్టు కనిపిస్తోన్నాయి చమురు కంపెనీలు. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 రూపాయలను దాటింది. డీజిల్ 105 నుంచి 110 రూపాయలకు చేరింది. కొన్ని చోట్ల డీజిల్ 110 రూపాయలను దాటేసింది.

petrol and diesel Prices hiked as 35 paise each again on October 29, 2021: Check rates here for your city

తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.108.64 పైసలకు చేరింది. డీజిల్ 97.37 పైసలుగా నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.114.47 పైసలు పలుకుతోంది. అక్కడ డీజిల్‌ రూ.105.49 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.109.02 పైసలుగా నమోదైంది. డీజిల్‌ ధర రూ.100.49 పైసలుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోల్ రూ.105.43 పైసలు, డీజిల్‌ ధర రూ.101.59 పైసలుగా ఉంటోంది. పెట్రోల్ అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం మూడు రూపాయల మేర పన్నును తగ్గించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినట్టయింది.

ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ ధరలు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల విరామం లభిస్తోందే తప్ప.. పెరుగుదల అక్కడితో ఆగట్లేదు. ఆ విరామం ప్రకటించిన రోజుల్లో నెలకొన్న లోటును కూడా భర్తీ చేసుకునేలా పెట్రోల్, డీజిల్ రేట్లను భగ్గు మనిపిస్తున్నాయి చమురు సంస్థలు, ఈ ఏడాది మే 4వ తేదీన మొదలైన పెరుగుదల.. ఈ అయిదు నెలల పాటు వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వచ్చింది. 45 నుంచి 50 రోజుల పాటు ప్రతిరోజూ వాటి రేట్లు పెరిగాయి. మధ్యలో కొంత విరామం తీసుకున్నాయి.

మళ్లీ ఆకాశానికి ఎగబాకడం మొదలు పెట్టాయి. రోజువారీ పెరుగుదలలో అడపాదడపా కొంత విరామం లభిస్తోందే తప్ప.. రేట్లు మాత్రం తగ్గట్లేదు. రెండు రోజులు బ్రేక్ ఇస్తే.. వారం రోజుల పాటు వాటి ధరలను పెంచే పరిస్థితి దేశంలో నెలకొంది. ఈ రోజుతో ఇంధన ధరలను పెంచడాన్ని చమురు సంస్థల ఆపివేస్తాయని ఏ రోజుకు ఆ రోజు అనుకోవడం ఓ అత్యాశగానే మిగిలిపోయింది. ప్రతిరోజు వాహనదారులను బాదడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోన్నాయి చమురు సంస్థలు.

ఇదివరకట్లా మళ్లీ వరుసగా వాటి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచబోవనే గ్యారంటీ ఉండట్లేదు. రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రేట్లు మరింత వేగంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర చొప్పున పెంచుతూ వస్తోండటం వల్ల మూడు రోజుల్లోనే ఒక రూపాయిని దాటస్తున్నాయి వాటి ధరలు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. రేట్లు తగ్గే అవకాశం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+