మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల షాక్.. ఈ సారి ఎంతంటే..!?

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. వాహనదారులకు మళ్లీ షాక్ తప్పేలా లేదు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హర్ముజ్ జలసంధి మళ్లీ మూసివేత పెట్రో ఉత్పత్తుల దిగుమతుల పైన ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచేందుకు ఆయిల్ కంపెనీలు ప్రతిపాదనలు సిద్దం చేసాయి. కేంద్రం ఆమోదిస్తే నిర్ణయం వెలువడనుంది.

వాహన దారులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు సిద్దం అవుతున్నాయి. అమెరికా - ఇరాన్ యుద్దంతో పాటుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. హర్ముజ్ జలసంధి మళ్లీ మూసివేయడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. కొద్ది రోజుల వ్యవధిలో ఇప్పటికే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.7.50 మేర పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచితే సామాన్యులపై భారీగా భారం పడనుంది. అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో.. హోర్ముజ్ జలసంధి మరోసారి మూసుకుపోయింది. ఇది ప్రపంచ చమురు సరఫరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

petrol-and-diesel-prices-likely-to-rise-again-as-global-crude-oil-prices-surge-here-the-reports

మారుతున్న పరిణామాలతో పెంపు పై చర్చ

తాజా ఉద్రిక్తతలు పెరగటంతో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 90 డాలర్లను దాటాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ తర్వాత ఇది బ్యారెల్‌కు 71 డాలర్లకు పడిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని భావించారు. కాగా, ఇప్పుడు ముడి చమురు ధరలు బాగా పెరగటంతో..పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయనే భయాలను మరోసారి పెంచింది. బ్రెంట్ ముడి చమురు ఈరోజు 2.70 శాతం పెరిగి బ్యారెల్‌కు 90.52 డాలర్లకు చేరింది. ఇక యూఎస్ ముడి చమురు 2.27 శాతం పెరిగి బ్యారెల్‌కు 84.37 డాలర్లకు చేరింది. హోర్ముజ్ జలసంధి దీర్ఘకాలం పాటు మూసివేయడం, అమెరికా-ఇరాన్‌ల మధ్య సుదీర్ఘ యుద్ధం కొనసాగడం వంటివి ముడి చమురు ధరలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+