తగ్గేదే లే: వరుసగా రెండోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయ్

న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వాటి గ్రాఫ్ పైపైకి ఎగబాకడం మొదలు పెట్టింది. ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన ధరల్లో పెరుగుదల నమోదైంది. చివరిసారిగా కిందటి నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. 18 రోజుల విరామం అనంతరం.. వాటి రేట్లల్లో కదలిక వచ్చింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండోరోజే ఇంధన ధరలు పెరిగాయి. అక్కడితో దాని ప్రస్థానం ఆగలేదు. వరుసగా రెండోరోజు కూడా రేట్లను పెంచేశాయి చమురుసంస్థలు.

ఎంత పెరిగిందంటే..

ఎంత పెరిగిందంటే..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 19 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 21 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.90.74, డీజిల్ 81.12 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 97.12 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 85.19 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 92.70, డీజిల్‌ ధర రూ. 86.09, కోల్‌కతలో పెట్రోల్ రూ.90.92 పైసలు, డీజిల్‌ ధర రూ.83.98 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్-93.03, డీజిల్-86.33, బెంగళూరులో పెట్రోల్-93.77, డీజిల్-86.01, భోపాల్‌లో పెట్రోల్-98.75, డీజిల్-89.38, చండీగఢ్‌లో పెట్రోల్-87.31, డీజిల్-80.81, లక్నోలో పెట్రోల్-88.97, డీజిల్-81.51గా రికార్డయ్యాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన విలువ ఆధారిత ధరల ప్రకారం.. వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లు ఉంటాయి.

వరుసగా రెండోరోజు..

వరుసగా రెండోరోజు..

పెట్రోల్, డీజిల్ ధరలు 66 రోజుల తరువాత మంగళవారం తొలిసారిగా పెరిగిన విషయం తెలిసిందే. అదే దూకుడును మళ్లీ కొనసాగింపజేశాయి చమురు సంస్థలు. రెండోరోజు కూడా ఇంధన ధరలను పెంచేశాయి. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన వాటి రేట్లు పెరిగాయి. ఈ మధ్యకాలంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. వాటి ఫలితాలు వెలువడిన తరువాత మూడురోజుల్లో రెండుసార్లు రేట్లు పెంచడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

ఇక్కడితో ఆగుతుందా?

ఇక్కడితో ఆగుతుందా?


పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల రెండోరోజుతో ఆగుతుందా? లేదా? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలను బట్టి చూస్తే.. మరోమారు పెరిగే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది. గతవారం క్రూడాయిల్ రేట్లు భారీగా పెరిగాయి. ఏడు వారాల గరిష్ఠ పెరుగుదల కనిపించింది. అమెరికన్ మార్కెట్‌ బ్రెంట్ క్రూడాయిల్ డాలర్ రేటు 2.09 మేర పెరిగింది. దీనితో బ్యారెల్ ఒక్కింటికి 69.49 డాలర్ పలుకుతోంది. యూఎస్ వెస్ట్ ట్యాక్సెస్ ఇంటర్మీడియట్‌లోనూ డాలర్ 1.70 మేర పెరుగుదలను నమోదు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+