వాహనదారులపై పిడుగు: పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెంపు
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఈ రెండు వారాల వ్యవధిలో వీటి రేట్లు పెరగడం ఇది నాలుగోసారి. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలను దాటేసింది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. లీటర్, డీజిల్ పై లీటర్ కు ఏకంగా రూ. 2.61 పైసలు, డీజిల్ పై రూ. 2.71 పైసల మేర పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.
ఈ నెలలో ఇంధన ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. మొదటిసారిగా ఈ నెల 15న వీటి రేట్లను పెంచింది కేంద్రం. ఆ తర్వాత మే 19న పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరగ్గా, రెండు రోజుల కిందటే అంటే 23న కూడా సుమారు 90 పైసల మేర సవరించింది.

తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12, డీజిల్ రూ. 95.20 పైసలకు చేరింది. ఇతర ప్రధాన నగరాలలో ధరలను పరిశీలిస్తే, కోల్‌కతాలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 113.51, డీజిల్ రూ. 99.82 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.107.77 కాగా ఉండగా, డీజిల్ రూ. 99.55 పైసలుగా నమోదైంది.
ముడిచమురు ధరలు భారీగా పడిపోయినప్పటికీ, దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 4.75 శాతం క్షీణించి బ్యారెల్‌కు 98.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో కూడా వీటి ధరల్లో క్షీణత కనిపించింది. క్రూడ్ 4.76 శాతం మేర పడిపోయి బ్యారెల్‌కు 92.00 డాలర్లకు చేరాయి. ఈ రెండు చోట్లా వీటి రేట్లు 100 డాలర్లకు దిగువనే ట్రేడ్ అయ్యాయి.
ముడిచమురు ధరలు తగ్గుతున్నా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం.. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 10, డీజిల్‌పై రూ. 13 వరకు నష్టాలు వస్తున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంధనం కొరత తాత్కాలికమేనని పేర్కొంది. మే 1 నుండి 22 వరకు పెట్రోల్ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 14 శాతం, డీజిల్ దాదాపు 18 శాతం పెరిగాయని ఇండియన్ ఆయిల్ తెలిపింది.
పెట్రోల్, డీజిల్ లాగే వాహనాలకు ఇంధనంగా వాడే సీఎన్‌జీ ధరలు కూడా పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) వెబ్‌సైట్ ప్రకారం, మే 23న ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోగ్రామ్‌కు ₹80.09 నుండి ₹81.09కి పెరిగింది. పది రోజులలోపు ఇది మూడో పెంపు. అంతకుముందు మే 15న ₹2, మే 17న ₹1 పెంపులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications