పెట్రోల్, డీజిల్ ధరల మోత: నెలలో మూడోసారి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ ధరలు పెరగడం సెప్టెంబర్ నుంచి ఇది ఆరోసారి కాగా, నెలలో ఇది మూడోసారి. పెట్రోల్ ధరలు లీటరుకు 89 పైసలు పెరగగా, డీజిల్ లీటర్ 86 పైసలు పెరిగాయి. శనివారం అర్థరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.
స్థానిక అమ్మకం పన్నును లేదా వ్యాట్‌ను మినహాయిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి) పెరిగిన ధరలను ప్రకటించింది. వ్యాట్‌ను కలిపితే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.67.62 పలుకుతుంది. ప్రస్తుతం ధర ఢిల్లీలో 66.45 ఉంది.

అదే విధంగా డీజిల్ లీటర్ ధర వ్యాట్‌ను కలుపుకుని ఢిల్లీలో 57.41 అవుతుంది. ప్రస్తుతం ఆ ధర రూ.66.45 ఉంటుంది. ఈ ధరలు పెరగడం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరోసారి కాగా, ఐదు సార్లు కలుపుకుని ఈపెట్రోల్ ధర 7.53 పెరిగింది.
ఈ నెలలో డీజిల్ ధర పెరగడం ఇది మూడోసారి. రూపాయి, యుఎస్ డాలర్ మారకం రేటు ప్రస్తుత స్థాయి అంతర్జాతీయ ఉత్పత్తుల ధరల కారణంగా పెంపు అనివార్యమైందని ఐఎసి ప్రకటించింది.












Click it and Unblock the Notifications