జీఎస్టీ కిందికి వస్తే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.38: ప్రభుత్వం ముందుకు వస్తుందా?

Subscribe to Oneindia Telugu
Petrol, diesel should come under GST, What You Need To Know ? పెట్రోల్ ధర లీటర్‌కు రూ.38 |Oneindia

న్యూఢిల్లీ: తాజాగా పెరిగిపోతున్న పెట్రో ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం కావడం గమనార్హం. ప్రస్తుతం పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాలు తగ్గించకపోగా.. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బహిరంగ వేదికల్లో కోరుతుండటం గమనార్హం. ఇక రాష్ట్రాలు కూడా కేంద్రం పన్నులు తగ్గిస్తే పెట్రో ధరలు తగ్గుతాయని చెబుతున్నాయి. ఇలా రెండు ప్రభుత్వాల వైఖరి కారణంగా ప్రజలపై పెను భారం తప్పడం లేదు.

కీలకంగా ప్రధాన్ సూచన

కీలకంగా ప్రధాన్ సూచన

ఈ నేపథ్యంలో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సూచనలు కీలకంగా మారాయి. పెట్రో ధరలను స్థిరీకరించేందుకు ఒకటే మార్గమని, అది జీఎస్టీని పెట్రో ఉత్పత్తులకు వర్తింపజేయడమేనని చెప్పుకొచ్చారు. ఈ కారణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయని చెప్పారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్ కు నేతృత్వం వహిస్తున్న అరుణ్ జైట్లీ.. ప్రధాన్ సూచనలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

భారీగా తగ్గే అవకాశం

భారీగా తగ్గే అవకాశం

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.80కి చేరింది. ఢిల్లీలో రూ.70కిపైగా ఉంది. ఒక వేళ పెట్రోల్ ను కూడా జీఎస్టీ కిందికి తీసుకొస్తే.. ఢిల్లీలో ఆ రేటు రూ.38.10కి తగ్గే అవకాశం ఉంది. కాగా, 2014 ఆగస్టులో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. రూ.70 మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగిన సమయంలో ధరలు పెరిగాయి కానీ, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గినా ధరలు తగ్గకపోవడం గమనార్హం. అప్పుడు బరెల్ కు 98 డాలర్లు ఉంటే.. ఇప్పుడు 50 డాలర్లు మాత్రమే ఉంది. అయినా పెట్రోల్ ధర లీటరుకు రూ.70కి పైగానే ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకింత ఖరీదు

పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకింత ఖరీదు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఢిల్లీలో పెట్రోల్ ధర రిఫైనరీల వద్ద రూ. 26.65గా ఉంది. ఇది డీలర్లకు రూ. 30.70కి వస్తుంది. కానీ, ఢిల్లీలోని డీలర్లు రూ. 70.39కి లీటర్ పెట్రోల్ ను అమ్ముతారు. అంటే పన్నులు, డీలర్ కమీషన్ కలిపి రూ. 39.41పైసలను వినియోగదారుడి నుంచే వసూలు చేస్తున్నారు.

దాదాపు అన్ని వస్తువులు జీఎస్టీ కిందికి రాగా, ఒక్క పెట్రో ఉత్పత్తులు మాత్రమే జీఎస్టీ నియంత్రణలోకి రాలేదు. ఇప్పటికీ ప్రభుత్వాలు వ్యాట్‌ విధానాన్నే అమలు చేస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులపై వివిధ రాష్ట్రాలు భిన్నంగా వ్యాట్‌ను వసూలు చేస్తున్నాయి.
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) ప్రకారం.. ఢిల్లీ 27శాతం వ్యాట్ విధిస్తుండగా, ముంబై, థానే, నేవీ ముంబైలో ఇది 47.64గా ఉంది. ఈ రెండు నగరాల్లో సుమారు 9రూపాయల వ్యత్యాసం ఉంది.

జీఎస్టీ కిందికి పెట్రో ఉత్పత్తులు వస్తే ఏమవుతుంది?

జీఎస్టీ కిందికి పెట్రో ఉత్పత్తులు వస్తే ఏమవుతుంది?

ఒక వేళ జీఎస్టీ కిందికి పెట్రోల్, డీజిల్ వస్తే ఇప్పటితో పోలిస్తే చాలా తక్కువ ధరకే వినియోగదారులకు ఇవి అందుబాటులోకి వస్తాయి. జీఎస్టీ విధానంలో 0, 5, 12, 18, 28శాతాల్లో మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. అయితే, పెట్రో ఉత్పత్తులపై 12శాతం కంటే మాత్రం తక్కువగా పన్ను విధించడం జరగదు.

సగానికి తగ్గనున్న పెట్రోల్ ధర

సగానికి తగ్గనున్న పెట్రోల్ ధర

ఒక వేళ 12శాతం జీఎస్టీతో పెట్రోల్ ను అమ్మితే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 38.1కే లభిస్తుంది. అంటే దాదాపు రూ.32 తక్కువకే ఇంధనం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ 18శాతం జీఎస్టీ అమలు చేస్తే పెట్రోల్ లీటర్ కు రూ.40.05కే లభిస్తుంది. 28శాతం జీఎస్టీ అమలు చేసినా రూ.43.44క లీటర్ పెట్రోల్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఈ 28శాతంపై ఎస్ యూవీ కంపెన్సెషన్ సెస్ వేసినా రూ. 50.91కే లీటర్ పెట్రోల్ లభిస్తుంది. అంటే ఇప్పటి ధరలతో పోలిస్తే రూ. 20 తక్కువకే లీటర్ పెట్రోల్ లభిస్తుంది.

డీజిల్ కూడా

డీజిల్ కూడా

ఇప్పుడు ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.58.72గా ఉంది. దీనిపై 12శాతం జీఎస్టీ విధిస్తే రూ.36.65కే లీటర్ డీజిల్ లభిస్తుంది. అదే 18శాతం విధిస్తే 38.61, 28శాతం విధిస్తే రూ. 48.88కే లీటర్ డీజిల్ అందుబాటులోకి వస్తుంది. దీనిపై ఎస్ యూవీ సెస్ విధిస్తే రూ. 49.08కే లీటర్ డీజిల్ వినియోగదారుడికి లభిస్తుంది. అయినా కూడా ప్రస్తుత ధర కన్నా ఇది రూ. 9.64 తక్కువనే కావడం గమనార్హం.

కేంద్రం ముందుకొచ్చినా.. రాష్ట్రాలు మాత్రం

కేంద్రం ముందుకొచ్చినా.. రాష్ట్రాలు మాత్రం

అయితే, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీకి కిందికి తీసుకురావడం రాజకీయాలతో ముడిపడివుంది. జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే.. కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న అన్ని రాష్ట్రాలు ఇందుకు అంగీకరించాల్సి ఉంటుంది. బంగారు బాతు లాంటి పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ కిందికి తీసురావడం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ కిందికి తీసుకురావడం కేంద్రానికి పెద్ద తలనొప్పే. ఇలా కేంద్ర, రాష్ట్రాల వైఖరి కారణంగా వినియోగదారుడు మాత్రం పెట్రో భారాన్ని మోయకతప్పడం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Petroleum Minister Dharmendra Pradhan had on Wednesday said that the government is thinking about bringing fuels prices under the ambit of GST which will lessen the price burden on consumers.
Please Wait while comments are loading...