అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చే ముందు ఆ పని చేశారా.. గ్రేట్ సార్ !!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం 'రాకా'. ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గానే బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్.. గుండుతో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ తో లుక్ ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే రాకా కథ, అల్లు అర్జున్ పాత్రపై సోషల్ మీడియా వేదికగా అనేక ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్ర రెండు విభిన్న స్వభావాలతో ఉండబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పగలు సాధారణ మనిషిలా ఉండే హీరో.. రాత్రి భయంకరమైన రాక్షసుడి లాగా మారిపోతాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం డ్యూయల్ రోల్ మాత్రమే కాకుండా.. ఒక సైకాలజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కథగా కూడా ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక పాత్ర పాజిటివ్ కాగా.. మరో పాత్ర నెగెటివ్ అని స్పష్టం అవుతోంది. అలానే కొందరు ట్రిపుల్ రోల్ కూడా ఉండొచ్చని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారని ప్రచారం నడుస్తోంది.
ఇక ఎందరో స్టార్ హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందు వేరే పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ జాబితాలో అల్లు అర్జున్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. స్టార్ నిర్మాత కొడుకు అయినా కానీ అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి ఉద్యోగం చేశారట. బన్నీ అంతకు ముందు యానిమేటర్ గా పనిచేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications