ఎల్లుండు శని జయంతి.. ఇవి చేయండి అన్నివిధాలుగా కలిసివస్తుంది

సాధారణంగా శని అంటే అందరూ భయపడతారు. కానీ శని తలుచుకుంటే ఎంతో మంచి చేస్తాడు. అందుకు మీరు కూడా మంచి పనులు చేస్తుండాలి. మనం చేసిన కర్మల ప్రకారమే ఫలితాలను శనిదేవుడు ప్రసాదిస్తాడు. ఈ ఏడాది మే 16వ తేదీన శని జయంతి జరుపుకుంటున్నాం. వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య రోజు ఇది వస్తుంది. అదే రోజు అమావాస్య, రోహిణి నక్షత్రం కలిసి రావడం చాలా అరుదైన శుభప్రదమైన యోగంగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఈ రోజు భక్తులు శని దేవుడి అనుగ్రహం కోసం, శని దోషాల నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజున పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.

ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి

ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి. తలంటు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శని దేవుని ఆలయంలో లేదా ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శని దేవునికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం. నల్ల నువ్వులు, బెల్లం లేదా ఉలవలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది.

Shani Jayanti brings a powerful opportunity for blessings follow these simple remedies for favorable results

ఎవరినీ విమర్శించకూడదు

శని దేవుడు కర్మ ఫల ప్రదాత. కాబట్టి ఈ రోజున చేసే దానాలకు ప్రత్యేక ఫలితం ఉంటుంది. నల్లని వస్త్రాలు, గొడుగు, లేదా తోలు చెప్పులను అవసరార్థులకు దానం చేయవచ్చు. ఏలినాటి శని, అష్టమ శని దోషాల నుండి దీనివల్ల విముక్తి పొందుతారు. నల్ల నువ్వులు లేదా ఇనుప వస్తువులను దానం చేయడం శుభప్రదం. పేదలకు అన్నదానం చేయడం వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడు. ఆ రోజు ఎవరినీ విమర్శించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ముఖ్యంగా పనివారు, వృద్ధులు, శారీరక వికలాంగులను గౌరవించాలి.

ఈ రోజున మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. సాధారణంగా శని జయంతి రోజున కొత్తగా ఇనుప వస్తువులను ఇంటికి కొనకపోవడం ఉత్తమం. శని దేవుడు కేవలం కష్టాలను ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, క్రమశిక్షణను నేర్పే గురువు కూడా. భక్తితో, నిష్కల్మషమైన మనసుతో ప్రార్థిస్తే శని దేవుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+