వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలోని పలు జిల్లాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పెట్రోల్

కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు.. గోరుచుట్టుపై రోకటిపోటులా చమురు ధరలు పెరుగుతున్నాయి. శుక్రవారం పెట్రోలుపై 28 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచారని, దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.98.48, డీజిల్‌ ధర రూ.93.08కి చేరిందని ఈనాడులో వార్త రాశారు.

మరోవైపు ఇంధనం నిల్వ కేంద్రం నుంచి రవాణా దూరం ఆధారంగా ఇప్పటికే రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, జోగులాంబ జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర రూ.వంద దాటింది. కుమురం భీం, నిర్మల్‌ జిల్లాలూ శుక్రవారం ఈ జాబితాలో చేరాయి.

మొత్తంగా నాలుగు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.వంద దాటడం గమనార్హం.

https://twitter.com/themohanbabu/status/1381816245905813506

'తన రూటే సపరేటు' అంటూ మోహన్ బాబు సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన చిరంజీవి

''నేను చీకటిలో ఉండే వెలుతురుని, వెలుతురులో ఉండే చీకటిని’’అంటున్నారు మోహన్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న 'సన్నాఫ్‌ ఇండియా’ టీజర్‌లోనిదీ డైలాగ్‌. తమిళ నటుడు సూర్య శుక్రవారం టీజర్‌ విడుదల చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.

'మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నా. తన రూటే సపరేటు. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఏ వేషంలో ఉంటాడో... ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో న్యూరాన్స్‌ ఎప్పుడు ఎలాంటి థాట్‌ను ట్రిగ్గర్‌ చేస్తుందో, ఏ బ్రెయిన్‌ స్పెషలిస్టూ చెప్పలేడు’ అంటూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ ప్రారంభమైంది.

మోహన్‌బాబు మాట్లాడుతూ ''వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని చిరంజీవిని అడిగిన వెంటనే ఓకే అన్నాడు. 'ఆచార్య’ చిత్రీకరణలో బిజీగా ఉన్నప్పటికీ... నాకోసం తనే స్వయంగా థియేటర్‌ బుక్‌ చేసి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్నాడు. నాకు విషయం తెలిసి విష్ణును పంపించా. అంత గొప్ప మనసు ఎవరికి ఉంటుంది? తనకు, టీజర్‌ విడుదల చేసిన సూర్యకు ధన్యవాదాలు’’ అన్నారు.

టీజర్‌లో 'నేను కసక్‌ అంటే... మీరందరూ ఫసక్‌’ అని మోహన్‌బాబు చెప్పిన డైలాగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. 'డైమండ్‌’ రత్నబాబు దర్శకత్వంలో విష్ణు మంచు నిర్మిస్తున్న చిత్రమిది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్

జర్మన్‌ హ్యాంగర్స్‌ విధానంలో కోవిడ్ ఆస్పత్రి

కరోనా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్‌ స్టీల్‌ పరిశ్రమ వద్ద రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జర్మన్‌ హ్యాంగర్స్‌ విధానంలో 500 ఆక్సిజన్‌ పడకల తాత్కాలిక కోవిడ్‌ ఆసుపత్రి ప్రారంభమైందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ నిల్వలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చూపిన చొరవ అభినందనీయం అన్నారు.

'ఆర్జాస్‌ స్టీల్‌కు ఉన్న ఎయిర్‌ సెపరేషన్‌ ప్లాంట్‌ ద్వారా రోజూ దాదాపుగా వచ్చే 100 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని జర్మన్‌ హ్యాంగర్‌లతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పని చేశారు. పేరుపేరునా అందరికీ అభినందనలు. చంద్రుడూ.. గుడ్‌ జాబ్‌..’ అంటూ కలెక్టర్‌ గంధం చంద్రుడిని అభినందించారు.

అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ శమంతకమణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేంద్రం అనాలోచిత విధానాలతోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.. కేటీఆర్

ఇతర దేశాల్లో మిగిలిపోయిన టీకాలను కేంద్రం చొరవ తీసుకొని మన దేశానికి తెప్పించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.

అమెరికా, నార్వే, డెన్మార్క్‌, కెనడా వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలు తెప్పిస్తే వ్యాక్సినేషన్‌లో మనం ముందుంటామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదని విమర్శించారు.

శుక్రవారం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)లో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) అధ్వర్యంలో మైక్రోసాఫ్ట్‌, కాగ్నిజెంట్‌, క్వాల్కం, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, వెల్స్‌ఫార్గో సంస్థల సౌజన్యంతో రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన 150 ఐసీయూ పడకలను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు కరోనా ఫస్ట్‌వేవ్‌ సందర్భంగా రూ.80 కోట్ల వ్యయంతో వైద్యపరికరాలు అందించాయని, సెండ్‌వేవ్‌లో టిమ్స్‌లో 150 ఐసీయూ పడకలను రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేయడం గొప్ప విషయమని కొనియాడారు.

కరోనా సమస్య శాశ్వత పరిష్కారానికి దేశాన్ని వ్యాక్సినేట్‌ చేయడం ఒక్కటే మార్గమని స్పష్టంచేశారు. విదేశాల నుంచి వ్యాక్సిన్లు తెప్పించకపోగా, దేశంలో సరిపడా ఉత్పత్తి లేదని తెలిసీ 18 ఏండ్లు నిండినవారందరికీ టీకాలు ఇస్తామని ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకొన్నదని మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ జ్వరసర్వే నిర్వహించి, కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం కూడా అనుసరిస్తున్నదని తెలిపారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో పోలిస్తే కరోనా కట్టడిలో తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉన్నదని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు హైరిస్క్‌ క్యాటగిరీలో ఉన్న జన సహాయకులకు (సూపర్‌ స్ప్రెడర్లు) టీకాలను ప్రాధాన్యతా క్రమంలో అందిస్తున్నామని చెప్పారు.

కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందకు ప్రభుత్వ దవాఖానల్లో పడకలు పెంచామని, మౌలికవసతులు కల్పించామని చెప్పారు. అందుకే సెకండ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ సేవలందిస్తున్నట్టు పేర్కొన్నారు.

గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌కాంప్లెక్స్‌ను 1,500 పడకల సామర్థ్యం కలిగిన టిమ్స్‌గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకొచ్చి వేల మందికి చికిత్స అందించామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Petrol rate crosses rs hundred per litre in districts of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X