వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిహెచ్‌డి విద్యార్థినిపై పలుమార్లు రేప్, బెదిరింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

 PhD student at JNU raped, threatened
న్యూఢిల్లీ: ఓ రీసెర్చ్ స్కాలర్ తనపై పలుమార్లు అత్యాచారం చేసి బెదిరించినట్లు పాతికేళ్ల జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థిని ఆరోపించింది. విశ్వవిద్యాలయం ఆవరణలోనే తనపై అతను లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె చెప్పింది. సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని అతను తనను బ్లాక్‌మెయిల్ చేశాడని, బెదిరించాడని ఆమె అంటోంది.

జెఎన్‌యులో ఈ విధమైన సంఘటనల్లో ఇది మూడోది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయలేదు. అతను దక్షిణ ఢిల్లీలోని మునిరికా ప్రాంతంలో ఉంటాడు. తాను ఇది వరకే పోలీసులకు ఫిర్యాదు చేశాన చెప్పింది. పోలీసులు మంగళవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బాధితురాలు మంగళవారం సాయంత్రం 100 నెంబర్‌కు డయల్ చేసి పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చింది. దాంతో న్యాయపరమైన చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. ఆమెను పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు తీసుకుని వెళ్లారు. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

తాను నిందితుడితో సన్నిహితంగానే ఉండేదాన్నని, అతను తరుచుగా అమ్మాయిల హాస్టల్‌కు వస్తుండేవాడని, ఓసారి అకస్మాత్తుగా తనపై లైంగిక దాడికి దిగాడని, ఆ విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడని, సంఘటనను చిత్రీకరించాడని, ఆ తర్వాత అతను మనిరికాలోని ఫ్లాట్‌కు తీసుకుని వెళ్లి అక్కడ కూడా తనపై అత్యాచారం చేశాడని ఆమె తన వాంగ్మూలంలో వివరించింది.

పోలీసులకు చెప్తే కెరీర్‌ను మంట గలుపుతానని నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు చెప్పింది. గతంలో బాధితురాలు ఫిర్యాదు చేసిందని, అయితే, పోలీసులు అతని తల్లిదండ్రులను పిలిపించి రాజీ కుదుర్చారని అంటున్నారు.

పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అమ్మాయి పోలీసులకు విషయం చెప్పగానే నిందితుడు పారిపోయినట్లు తెలుస్తోంది. అతని కోసం అతని సొంత పట్టణంలో, రహస్య స్థావరాల్లో పోలీసులు గాలిస్తున్నారు. అతను బీహార్‌లోని పాట్నాకు చెందినవాడని పోలీసులు చెప్పారు.

English summary

 A 25-year-old PhD student of Jawaharlal Nehru University has alleged that she was sexually assaulted several times inside the campus by a research scholar a few weeks ago. She alleged that he even blackmailed and threatened her to suppress the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X