ఫిర్ మోడీ హీ ఆయేంగే.. 2024 లోకసభ ఎన్నికల కోసం బీజేపీ ఎంపీ సాంగ్!!

2024 సంవత్సరంలో జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం బిజెపి సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ముందుగానే సన్నాహాలకు తెరలేపిన బీజేపీ వచ్చే ఎన్నికలలో మళ్లీ మోడీ నాయకత్వంలోనే ప్రభుత్వ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆజంగఢ్ ఎంపీ, భోజ్ పురి సినీనటుడు దినేష్ లాల్ యాదవ్ నిరాహువా తాజాగా తాను చేసిన కొత్త పాటను లాంచ్ చేశారు.

ఈ పాటలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన స్పష్టం చేశారు. నిరాహువా తన యూట్యూబ్ ఛానల్లో 2024 లో మోడీనే వస్తాడు అని తెలియచెప్పే పాటను విడుదల చేశారు. ఈ పాటను మృత్యుంజయ్ కుమార్ రాయగా, అందరినీ ఆకట్టుకునే సంగీతంలో ఈ పాటలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను సవివరంగా ప్రస్తావించారు.

Phir Modi Hi Aayenge.. BJP MP Song for 2024 Lok Sabha Election

ఇటీవల ఎన్నికలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లలో అద్భుతమైన విజయాన్ని సాధించిన బిజెపి, 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో దేశవ్యాప్తంగా మెజారిటీ సీట్లను గెలుచుకుంటామని ధీమాతో ఉంది. ఇక ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల కోసం ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఫోకస్ పెడుతున్నారు.

ఆజంగఢ్ ఎంపీ దినేష్ లాల్ యాదవ్ నిరాహువా గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పాడిన పాట సంచలనం సృష్టించింది. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో నిరాహువా ఆయేంగే తో యోగీ హై, జీతేంగీ బీజేపీ హై అంటూ పాడిన పాట ఉత్తరప్రదేశ్లో ఒక ఊపు ఊపింది. ఎన్నికల సమయంలో ప్రతి చిన్న పిల్లల నోట కూడా అదే పాట అప్పట్లో ఎక్కువగా వినిపించింది.

ఈసారి కూడా మోడీ కోసం చేసిన ఈ పాట రికార్డు బ్రేక్ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే ఈ పాట మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ యొక్క మెరుగుదలతో పాటు ఆయుష్మాన్ కార్డుల ప్రయోజనాల గురించి కూడా చెప్పింది. మరి ఈసారి ఎన్నికలకు ఈ పాట ప్రజాక్షేత్రంలో హిట్ టాక్ ని సంపాదించుకుంటుందా .. లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+