Photo shoot: శుభకార్యానికి వెళ్లింది, ఫ్రెండ్ తో కలిసి చెరువు దగ్గర ?, యువతి జలసమాది !

బెంగళూరు/ చిక్కబళ్లాపురం: బాగా చదువుకున్న యువతి మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నది. మంచి అబ్బాయి చిక్కితే యువతి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఉద్యోగం సంపాధించాలని ఆ యువతి అనేక ప్రయత్నాలు చేస్తోంది. దగ్గర బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి యువతి వెళ్లింది శుభకార్యంలో బందువులు అందరితో ఆమె చాలా సంతోషంగా గడిపింది. తరువాత ఫ్రెండ్ తో కలిసి గ్రామం సమీపంలో అందమైన పొలాలు చూస్తూ వెళ్లింది. ఫ్రెండ్ దగ్గరకు మొబైల్ ఫోన్ ఇచ్చిన యువతి చెరువు గట్టుమీద తాను ఉంటానని, ఆ సమయంలో వీడియో, ఫోటోలు తియ్యాలని చెప్పింది. చెరువు గట్టుమీద నిలబడి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో అదే చెరువులో పడి జలసమాధి అయ్యింది.

ఎంఏ పూర్తి చేసిన యువతి

ఎంఏ పూర్తి చేసిన యువతి


కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలోని శిడ్లఘట్ట తాలుకాలోని గాజులవారిపల్లిలో అముద అలియాస్ అమ్రుత (22) అనే యువతి నివాసం ఉంటున్నది. ప్రముఖ కాలేజ్ లో అముద ఎంఏ పూర్తి చేసింది. ఏంఏ పూర్తి చేసిన అముద ఆమె సొంత ఊరు గాజులవారిపల్లిలోనే ఉంటున్నది.

పెళ్లి చెయ్యాలని అనుకున్న పెద్దలు

పెళ్లి చెయ్యాలని అనుకున్న పెద్దలు

ఏంఏ చదువుకున్న అముద మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నది. మంచి అబ్బాయి చిక్కితే అముద పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఉద్యోగం సంపాధించాలని అముద గాజులవారిపల్లిలో ఉంటూనే అనేక ప్రయత్నాలు చేస్తోంది. అముద ఆమె బంధువుల శుభకార్యాలకు వెళ్లి వస్తోంది.

శుభకార్యానికి వెళ్లిన యువతి

శుభకార్యానికి వెళ్లిన యువతి

చిక్కబళ్లాపురం సమీపంలోని గంగానహళ్ళి గ్రామంలో నివాసం ఉంటున్న దగ్గర బంధువుల ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి అముద ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. శుభకార్యంలో బందువులు అందరితో అముద చాలా సంతోషంగా గడిపింది. రెండు రోజుల నాటు అముద బంధువుల ఇంటిలోనే ఉంటూ ఉల్లాసంగా గడిపింది.

 చెరువు గట్టుమీద ఫోటోలు

చెరువు గట్టుమీద ఫోటోలు

రెండు రోజుల తరువాత అముద అదే ఊరిలో ఉన్న ఫ్రెండ్ తో కలిసి గ్రామం సమీపంలో అందమైన పొలాలు చూస్తూ వెళ్లింది. ఇటీవల కురిసన భారీ వర్షాలకు గ్రామం సమీపంలోని చెరువు పొంగిపోర్లుతోంది. ఆ చెరువు దగ్గరకు అముద, ఆమె ఫ్రెండ్ వెళ్లారు. ఫ్రెండ్ దగ్గరకు మొబైల్ ఫోన్ ఇచ్చిన అముద చెరువు గట్టుమీద తాను నిలబడుతానని, ఆ సమయంలో వీడియో, ఫోటోలు తియ్యాలని చెప్పింది.

 చెరువులో జలసమాది

చెరువులో జలసమాది


చెరువు గట్టుమీద నిలబడిన అముద ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో కాలు జారి చెరువులో పడిపోయింది. షాక్ కు గురైన అముద ఫ్రెండ్ చెరువుకు చాలా దూరంలో ఉన్న తోటలో పని చేస్తున్న గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు చెరువు దగ్గరకు పరుగు తీశారు. అప్పటికే అర్దగంట అయిపోవడంతో చెరువులో మునిగిపోయిన అముదను బయటకు తీసి అంబులెన్స్ కు ఫోన్ చేశారు.

 ఉప్పు మీద పడుకోబెట్టి ?

ఉప్పు మీద పడుకోబెట్టి ?

ఉప్పు మీద అముదను పడుకోబెడితే బతుకుతుందని ఆశతో ఆ ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే అముద ప్రాణం పోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. శుభకార్యానికి వెళ్లిన అముద జలసమాది కావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+