కుంభమేళలో ఘోరం..మహిళల స్నానాల ఫొటోలు, నగ్న వీడియోలు రికార్డు చేసి ఆ పని
మహా కుంభమేళా తుది చేరుకు చేరుకుంది. శివరాత్రి పర్వదినంతో కుంభమేళా ముగియనుంది.144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా, ఫిబ్రవరి 26తో ముగియనుంది. మరో నాలుగు రోజులు మాత్రమే సమయంలో ఉండటంతో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తలు దేశ వ్యాప్తంగా తరలి వస్తున్నారు.
మొదట్లో ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేసుకున్నప్పటికీ, అంతకు మించిన స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటి వరకు 56 కోట్లకు పైగానే భక్తులు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచారించారని తెలుస్తోంది.ఈసారి మహిళలు సైతం భారీగా కుంభమేళాలో స్నానాలు ఆచారించారు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానాలకు వచ్చిన మహిళలు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు సీక్రెట్‌గా రికార్డు చేశారు.

కుంభమేళాలో కొన్ని చోట్ల మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించకపోయింది. దీంతో మహిళలు పుణ్యస్నానాలు చేసిన దగ్గరే దుస్తులు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు దుర్మార్గులు అమ్మాయిలు, మహిళలు దస్తులు మార్చుకున్న ఫొటోలను, వీడియోలను వారికి తెలియకుండా సీక్రెట్‌గా రికార్డు చేశారు. అయితే అలా రికార్డు చేసిన వీడియోలను, ఫొటోలను ఆన్‌లైన్‌లో ఉంచుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.అయితే ఈ వీడియోలు, ఫొటోలను చూడాలంటే డబ్బులు చెల్లించాలని ఆ కేటుగాళ్లు సోషల్ మీడియాలో లింక్‌లు షేర్ చేశారు. దీంతో తతంగం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన అమ్మాయిలు, మహిళలు ఆందోళనకు గురవుతున్నారు.ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీని వెనకాల ఉన్న కేటుగాళ్లు తాటతీస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనకు కారణమైన అకౌంట్ లు ఉన్న వారి సమాచారం ఇవ్వాలని యూపీ పోలీసులు మెటా సంస్థలకు ప్రత్యేకంగా లెటర్ లు రాయడం జరిగింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications