వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: భయపడి హీరోయిన్ల ప్రచారం అలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సినీ తారలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయా పార్టీలలో చేరిన నటీ నటులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ప్రముఖ నటి మూన్ మూన్ సేన్ తృణమూల్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా, గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా, రమ్య కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా... ఇలా ఒక్కో పార్టీ నుండి బరిలోకి దిగుతున్నారు.

నటి నగ్మా నామినేషన్ దాఖలు చేసి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన జయప్రద కూడా బిజ్నోర్‌లో దూసుకుపోతున్నారు.

గుల్ పనాగ్

గుల్ పనాగ్

అందగత్తె గుల్ పనాగ్ ప్రచారంలో దూసుకుపోతుంది. రోడ్ షోలతో చండీగఢ్‌ను మచ్చిక చేసుకుంటుంది. పిల్లల్లో అందమైన పిల్లలా, పెద్దలతో అణకువైన అతివలా.. మెప్పిస్తూ తన గెలుపు చండీగఢ్‌కు మలుపు అంటూ నినదిస్తోంది. అవినీతి నిర్మూలన నినాదమే అస్త్రంగా ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో సెన్షేష్ సృష్టించిన ఆమ్ ఆద్మీ స్క్రీన్ మీద గ్లామర్ రాజకీయ తారగా గుల్ పనాగ్ చండీగఢ్‌లో చేస్తున్న హడావుడిగా కనిపిస్తున్నారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

పిసి సర్కార్

పిసి సర్కార్

ప్రముఖ మెజీషియన్, బిజెపి బరాసత్ అభ్యర్థి పిసి సర్కార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ప్రచారం చేస్తున్న దృశ్యం.

గుల్ పనాగ్

గుల్ పనాగ్

అందగత్తె గుల్ పనాగ్ ప్రచారంలో దూసుకుపోతుంది. రోడ్ షోలతో చండీగఢ్‌ను మచ్చిక చేసుకుంటుంది. పిల్లల్లో అందమైన పిల్లలా, పెద్దలతో అణకువైన అతివలా.. మెప్పిస్తూ తన గెలుపు చండీగఢ్‌కు మలుపు అంటూ నినదిస్తోంది.

వైయస్ జగన్

వైయస్ జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో జోరుగా పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ కూడా ప్రచారం చేస్తున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం మీట్ ది పీపుల్ కార్యక్రమంలో యువతులతో మాట్లాడుతూ...

నగ్మా

నగ్మా

ప్రముఖ సినీ నటి నగ్మా ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె ఎడతెరిపి లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. నగ్మాకు రెండు రోజుల క్రితం సొంత పార్టీ ఎమ్మెల్యే నుండి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆమె అప్రమత్తంగా ప్రచారం చేస్తున్నారట.

మూన్ మూన్ సేన్

మూన్ మూన్ సేన్

ఎన్నికల జాతరలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవాలంటే ఎంతటి వారైనా ఊళ్ల వెంట పడి వీధి వీధినా తిరగాల్సిందే. పశ్చిమ బెంగాల్‌లోని బంకూరాలో టిఎంసి అభ్యర్థి, నిన్నటితరం అందగత్తె మూన్ మూన్ సేన్ ఎండకు జడిసి, సాయంత్రం వేళ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలంటే బయం లేదని, ఎండలో తిరగాలంటేనే ఇబ్బంది అంటున్నారు. 22 భాషల్లో 24 ఏళ్లు పాటు నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించానని, ఇపుడు తనను సంతోష పెట్టాల్సిన బాధ్యత జనానిదేనని సేన్ సెలవిస్తున్నారు.

English summary
It's election time. Each political party, their leaders and supporters are spending nervous nights as we proceed towards May 16. But for the time being, everyone related to Indian politics is busy giving the final touches to the preparations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X