శివప్రసాద్ నారద గానం, ఇక్కడ విజయమ్మ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: తప్పుల తడకలాంటి తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల్లాంటి తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య కురుక్షేత్ర యుద్ధాన్ని సృష్టించిందని టిడిపి చిత్తూరు ఎంపి శివప్రసాద్ విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి, సోనియాగాంధీ సీమాంధ్రులకు శఠగోపం పెట్టారని మండిపడ్డారు.

మంగళవారం సభ వాయిదా పడిన అనంతరం ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సుజనా చౌదరి, సిఎం రమేశ్‌లు మీడియాతో మాట్లాడారు. నారదుని వేషంలో వచ్చిన శివ ప్రసాద్ కాంగ్రెస్ విభజన వైఖరికి వినూత్నంగా నిరసన తెలిపారు.

భారతదేశానికి ప్రధాన శత్రువులు పాకిస్తాన్, చైనా అయితే సమైక్యాంధ్రకు కాంగ్రెస్, బిజెపిలు ప్రధాన శత్రువులని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకుంటామని వారు చెప్పారు. అప్పటి వరకూ పార్లమెంటును స్తంభింపజేస్తామన్నారు.

శివ 1

శివ 1

శివ ప్రసాద్ విభజన తీరును నిరసిస్తూ గానమాలపించారు. 'భలే గొప్ప చిచ్చు పెడితివే.. ఓ సోనియమ్మ భలే గొప్ప చిచ్చు పెడితివే!! అన్నదమ్ములే అసెంబ్లీలో, పార్లమెంటులో తన్నుకుని చచ్చేలా.. భలేగొప్ప చిచ్చు పెడితివే! ఉన్న రాష్ట్రాల్లో ఏలుకుని ఊరకే కూర్చోక.. సీమాంధ్ర జనం మీద శఠగోపం పెట్టినావు.

శివ 2

శివ 2

రెండు సార్లు గెలిపిస్తే రాష్ట్రం రెండు కావాలా? రాహూల్ పదవి కోసం రాద్ధాంతం చేస్తావా? జలం, విద్యుత్, గ్యాస్ మాటేమిటి? విద్యా, వైద్యం, ఉద్యోగ, పరిశ్రమల మాటేమిటి? మరో రాజధాని అభివృద్ధి కావాలంటే మాటలా? మా రైతుల గోడేమిటి? అందుకే.. సోనియమ్మ వినూ, వినూ! కళ్లు తెరచి కను, కనూ! విభజన ప్రక్రియ ఆపక పోతే.. ఇటలీ దాకా తరిమేరు నిన్ను! సోనియమ్మ వినూ, వినూ' అంటూ భజన చేశారు.

శివ 3

శివ 3

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కొనసాగాలనే బిజెపి భావిస్తోందా? బిజెపిది ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలా? అని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

విజయమ్మ

విజయమ్మ

మంగళవారం శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ.

విశాఖ

విశాఖ

తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి, చర్చకు అనుమతించడాన్ని నిరసిస్తూ విశాఖలో తెలుగు తల్లి విగ్రహం ముందు సమైక్యవాదుల నిరసన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+