ఎన్నికల డ్యూటీలో మరో బ్యూటీ!
భోపాల్: అయిదో విడత ఎన్నికల సందర్భంగా లేత పసుపురంగు చీరలో కనిపించి, మతి పోగొట్టిన పోలింగ్ అధికారిణి గురించి ఇప్పుడిప్పుడే ఎవ్వరూ మరిచిపోయి ఉండరు. ఓ సునామీలా సోషల్ మీడియాను చుట్టేసిన రీనా ద్వివేదీ ఫొటోలు ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ లోగా మరో మెరుపు మెరిసింది. ఆ మెరుపు పేరు యోగేశ్వరి గోడ్తే ఓంకార్. గ్రామీణ బ్యాంకు ఉద్యోగిని.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన యోగేశ్వరి.. పీప్లానీ ప్రాంతంలోని బ్యాంకులో పనిచేస్తున్నారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా- శనివారం ఈవీఎం, ఇతర సామాగ్రిని తీసుకెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. సోషల్ మీడియాలో లేటెస్ట్ సెన్షేషన్‌గా మారిపోయారు.

ఆరో విడత పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందిని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్స్‌కు పిలిపించారు. ఎవరు, ఎక్కడెక్కడ విధుల్లో పాల్గొనాలో వివరించారు. వారి చేతికి ఈవీఎం సహా ఎన్నికల సామాగ్రిని అందజేశారు. యోగేశ్వరిని గోవింద్‌పురాలోని ఐటీఐలో ఏర్పాటు చేసని పోలింగ్ బూత్ విధుల్లో నియమించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రెస్ ఫొటోగ్రాఫర్లు యోగేశ్వరి ఓంకార్‌ను క్లిక్ మనిపించారు. లేత నీలంరంగు స్లీవ్‌లెస్ గౌను వేసుకున్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో మరో సునామీని సృష్టిస్తున్నాయి.

విద్యాభాస్య సమయంలో యోగేశ్వరికి మోడలింగ్ అంటే ఎంతో ఇష్టమట. మోడలింగ్‌లో రాణించాలని ఉబలాట పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే, మోడలింగ్ వైపు అడుగులు వేశారు. ఈ లోగా చదువు పూర్తి కావటం, బ్యాంకులో ఉద్యోగం రావటంతో తన ఇష్టాన్ని వదులుకున్నారట.

ట్రెండ్ సెట్టర్లవుతారా?
ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులెవరూ పెద్దగా ఆసక్తి చూపరని, అయిష్టంగానే వారు ఎన్నికల విధులకు హాజరవుతుంటారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. వేలాడేసుకున్న ముఖాలతో కనిపిస్తుంటారని, వారికి భిన్నంగా మొన్న రీనా ద్వివేదీ, నిన్న యోగేశ్వరి ఎనర్జీతో ఎన్నికల విధులకు హాజరవుతుండటం మారుతున్న పరిస్థితులకు నిదర్శనమని అంటున్నారు. వారిద్దరూ ఓ ట్రెండ్‌ను సెట్ చేసినట్టేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications