PIC:వామ్మో.. ఏందిదీ, బల్బ్‌ల దొంగతనం, కారులో వచ్చి, ఎక్కడంటే..
దొంగలు కూడా కొత్త కొత్త టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. అవును.. వారు కూడా టెక్నాలజీ వాడుతున్నారు. ఏదో నడుచుకుంటూ వచ్చి.. దొంగతనం చేయడం లేదు. కార్లను కూడా వాడుతున్నారు. అవును మీరు చదివేది నిజమే.. రాజస్థాన్‌లో దొంగలు అదే పనిచేశారు. కానీ వారు దొంగతనం చేసింది.. కాస్ట్లీ ఐటెమ్ కాదు.. బల్బ్‌ల కోసం ఏకంగా కారు వాడారు.
నవల్ ఘడ్ వద్దకు దొంగలు కారులో వచ్చారు. వారు బల్బ్ దొంగతనం చేశారు. కారులో వెళుతుండగా కోల్సియా గ్రామం గుండా వెళ్లారు. ఝంఝును ఏరియా వద్ద సీసీటీవీ ఫుటేజీ చూశారు. ఆదివారం అర్ధరాత్రి వారు చోరీకి పాల్పడ్డాడు. మొత్తం నలుగురు కాగా.. ఒకరు కారు డ్రైవింగ్ చేస్తున్నారు. వారు ఆల్టొ కారులో దొంగతనానికి వచ్చినట్టు ఫుటేజీ గుర్తించారు.

తొలుత మొబైల్ స్టోర్ వద్ద బల్బ్ తీసివేశారు. పక్క స్టోర్ వెలుపల కుర్చీ తీసుకుని బల్ట్ తీశాడు. అయితే పక్క షాపు ఓనర్ మహేంద్ర దూత్‌కు శబ్దం వినిపించింది. ఏంటీ అని చూసేసరికి దొంగలు కనిపించారు. బల్బ్‌ల దొంగతనం కోసం వారు కారులో వచ్చారని గుర్తించారు. ఆ మరునాడు సీసీటీవీ ఫుటేజీ చూడగా క్లారిటీ వచ్చింది. అందులో దొంగలు స్పష్టంగా కనిపించారు. వారు కేవలం బల్బ్ దొంగతనం చేయడానికే కారులో వచ్చారని గుర్తించాడు.
బల్బ్ తీయడానికి వారు రహదారిని చీకటిగా మార్చారు. అక్కడ ఉన్న బల్బ్ తీసివేశారు. దీనికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందజేశారు. పోలీసులు కేసు విచారణను చేపట్టారు.












Click it and Unblock the Notifications