తిరుగుబాటు సరే..ఏక్‌నాథ్ షిండేకు చిక్కులు: బోంబే హైకోర్టులో పిల్: రెబెల్స్‌పైనా
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న రాజకీయ సంక్షోభం ఇక న్యాయస్థానాల గడప తొక్కింది. తిరుగుబాటు వర్గానికి నాయకత్వాన్ని వహిస్తోన్న శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కొన్ని గంటల్లోనే ఆయనకు వ్యతిరేకంగా మరో పిటీషన్ దాఖలైంది. బోంబే హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని బోంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది.
ఏక్‌నాథ్ షిండే.. తన వర్గానికి చెందిన శాసన సభ్యులపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో ఆయన రెండు పిటీషన్లు దాఖలు చేశారు. ఇందులో డిప్యూటీ స్పీకర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 12:30 స్పెషల్ వెకేషన్ బెంచ్ దీన్ని విచారించనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీస్‌కు వ్యతిరేకంగా ఒకటి, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజయ్ చౌధరిని అపాయింట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్లు టి దాఖలయ్యాయి.
ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే..ఏక్‌నాథ్ షిండే తరఫున విచారణకు హాజరు కానున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ, తెలంగాణకు చెందిన ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తమ వాదనలను వినిపించనున్నారు. ఈ మేరకు జంధ్యాల రవిశంకర్ ఆదివారం రాత్రి ముంబైలోని వర్షా బంగళాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలుసుకున్నారు. ఈ పిటీషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కాగా- ఏక్‌నాథ్ షిండే, తిరుగుబాటు శాసన సభ్యులపై బోంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. షిండే, ఇతర రెబెల్ ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను విస్మరించి, హోటల్‌లో కాలక్షేపం చేస్తోన్నారంటూ ఈ పిటీషన్‌లో పేర్కొన్నారు. తమ రోజువారీ ప్రజా ప్రయోజనాల కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ఆదేశించాలని కోరారు. ఉత్పల్ బాబురావు చందవార్, ఈ పిల్ వేశారు. బోంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఎంఎస్ కార్ణిక్‌తో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
పిటీషనర్ల తరఫున అడ్వొకేట్ అసీం సరోదే తన వాదనలను వినిపించారు. మరో న్యాయవాది అజింక్య ఉడనె ఈ వాదనల్లో ఇంప్లీడ్ అయ్యారు. మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజల అవసరాలు, వారి హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని చెప్పారు. శాసన సభ్యులు తమ బాధ్యతలను విస్మరించారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాల వల్ల చివరికి ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. ఈ వ్యవహారం అంతా పబ్లిక్ న్యూసెన్స్‌లా ఉందని వ్యాఖ్యానించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications