'ఫ్లెమింగో' పక్షుల అందాలు చూసొద్దామా..? హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?
పక్షి ప్రేమికులకు ఈ పర్యాటక ప్రాంతం స్వర్గధామంగా ఉంటుంది. అందమైన ఫ్లెమింగో పక్షులను ఎంత చూసినా తనివితీరదు. ఫ్లెమింగో అనేది పొడవాటి కాళ్లు, మెడ, గులాబీ రంగు ఈకలు కలిగిన ఒక అందమైన నీటి పక్షి. ఈ పక్షులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్ లోని పలు ప్రాంతాల్లో నివసిస్తాయి. సైబీరియా నుంచి ఇక్కడకు వలస వస్తుంటాయి. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉన్న పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం సమీపంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏటా 'ఫ్లెమింగో పండుగ' ను నిర్వహిస్తారు.
అయితే ముంబై థానేలోని థానే క్రీక్ ఫ్లేమింగో శాంక్చరీ ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది 2022లో రామ్ సర్ సైట్స్ గా పేరుగాంచింది. ఐరోలీ బ్రిడ్జ్ నుంచి వాషి బ్రిడ్జి మధ్యలో ఈ నార్తర్న్ థానే క్రీక్ ఫ్లేమింగో శాంక్చరీ ఉంది. ఈ శాంక్చరీ 65.21 కిలోమీటర్లు(16 వేల ఎకరాల్లో ఉంటుంది) వ్యవధిలో ఉంటుంది. ఈ పర్యాటక ప్రదేశానికి మహారాష్ట్ర నుంచి మాత్రమే కాకుండా.. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు విచ్చేస్తున్నారు.
ఫ్లెమింగో పక్షులను వీక్షించేందుకు నవంబర్ నుంచి మే వరకు అనువైన సీజన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ తొలివారం నాటికి 50 వేలకు పైగా ఫ్లెమింగో పక్షులు ఈ ప్రాంతానికి వలస వచ్చాయి. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అలాగే సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఫ్లెమింగో పక్షుల విన్యాసాలు, అందాలు చూడొచ్చు. ఇక్కడే ఫ్లెమింగో బోట్ సఫారీ కూడా ఉంది. రూ. 150- 200 టికెట్ ధరతో బోట్ సఫారీ చేయవచ్చు.

ఇక ఈ ప్రదేశానికి రైలులో చేరుకోవాలంటే ఐరోలీ రైల్వే స్టేషన్ ను చేరుకోవాలి. అక్కడి నుంచి 10 నిమిషాలు ఆటోలో ప్రయాణం చేస్తే శాంక్చరీకి చేరుకోవచ్చు. అలాగే రబేల్ స్టేషన్ కూడా ఈ శాంక్చరీకి దగ్గరలోనే ఉంది.












Click it and Unblock the Notifications