Plan B: కోర్టు విచారణ, సెంట్రల్ జైలు మెయిల్ గేట్ లోనే దొంగ ఎస్కేప్ !
బెంగళూరు/ఉడిపి: మొబైల్ షోరూమ్ లో చోరీ జరిగింది. బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు విచారణ చేశారు. మొబైల్ షాప్ లో చోరీ చేసిన ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతన్ని జైల్లో పెట్టారు. కేసు విచారణకు కోర్టుకు వెళ్లిన దొంగ తరువాత జైలు దగ్గరకు వెళ్లాడు. జైలు ఎంట్రన్స్ లోనే దొంగ తప్పించుకుని పారిపోవడం కలకలం రేపింది. పక్కనే పోలీసులు ఉన్నా ఆ దొంగ మాత్రం పక్కాప్లాన్ తో మాయం కావడంతో పోలీసులు బిత్తరపోయి బిక్కముఖం వేశారు.

మొబైల్ షోరూమ్ లో చోరీ
కర్ణాటకలోని ఉడిపి సమీపంలోని బిజాడి ప్రాంతంలో మొబైల్ షోరూమ్ ఉంది. కొన్ని నెలల క్రితం ఈ మొబైల్ షోరూమ్ లో చాకచక్యంగా చోరీ చేసిన నిందితులు లక్షల విలువైన మొబైల్ ఫోన్లు లూటీ చేసి మాయం అయ్యారు. బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

కేటుగాడు అందర్
మొబైల్ షాప్ లో చోరీ చేసిన భట్కల్ కు చెందిన మోహమ్మద్ రఫీక్ అలియాస్ రఫీక్ (22) అనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతన్ని జైల్లో పెట్టారు. బెయిల్ తీసుకుని బయటకురావాలని మోహమ్మద్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసు విచారణ కోసం మోహమ్మద్ రఫిక్ ను కుందాపురలోని ఏసీజే కోర్టు ముందు హాజరుపరిచారు.

జైలు ఎంట్రన్స్ గేట్ దగ్గరే జంప్ జిలాని
కోర్టు ముందు మోహమ్మద్ ను హాజరుపరిచారు. కోర్టులో విచారణ పూర్తి అయిన తరువాత మోహమ్మద్ మళ్లీ హిరియదొడ్డలోని జిల్లా సెంట్రల్ జైల్లో పెట్టడానికి పిలుచుకుని వెళ్లారు. ఆ సందర్బంలో కిందదిగిన పోలీసుల మీద దాడి చేసి అక్కడి నుంచి పరారైనాడు. సెక్యూరిటీగా వెళ్లిన పోలీసుల కడుపులో కొట్టిన నిందితుడు మోహమ్మద్ నిమిషాల వ్యవదిలోపే అటవి ప్రాంతం నుంచి తప్పించుకుని పరారైనాడు.












Click it and Unblock the Notifications