ప్మాస్మా థెరపీ వల్ల పెద్ద ప్రయోజనమేమీ లేదు: తేల్చేసిన ఎయిమ్స్

న్యూఢిల్లీ: ప్మాస్మా థెరపీపై ఎయిమ్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా బాధితులపై ప్లాస్మా థెరపీ విధానం పెద్దగా ప్రభావం చూపడం లేదని ఢిల్లీ ఎయిమ్స్ వెల్లడించింది. కరోనా రోగులపై నిర్వహించిన ప్మాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పారు.

ప్మాస్మా చికిత్స ఫలితాలను అంచనా వేసేందుకు 15 మంది కరోనా రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపినట్లు వెల్లడించారు. ఇందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించగా, మరో 15 మందికి సాధారణ పద్ధతితోపాటు ప్మాస్మా చికిత్సను అందించినట్లు తెలిపారు.

Plasma Therapy Trial by AIIMS Shows No Benefit in Reducing Covid-19Mortality Risk

ఈ రెండు విధానాల్లోనూ మరణాల రేటు సమానంగా ఉన్నట్లు తమ ప్రాథమిక విశ్లేషణలో తేలినట్లు రణదీప్ గులేరియా చెప్పారు. అయితే, దీనిపై స్పష్టత కోసం మరింత పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ప్మాస్మా థెరపీ వల్ల కరోనా రోగులకు ఎలాంటి ప్రమాదమూ లేదని, అయితే దీని వల్ల ప్రయోజనం కూడా లేదని వెల్లడించారు.

కరోనావైరస్ బారినపడి కోలుకున్న వారి రక్తంలోని ప్మాస్మాతో చేసే చికిత్సను ప్మాస్మా థెరపీగా పేర్కొంటున్నారు. సాధారణంగా మన శరీరంలోకి బయటి నుంచి వైరస్ ప్రవేశించినప్పుడు దీంతో పోరాడేందుకు యాంటీబాడీస్ విడుదలవుతాయి. అప్పుడు శరీరం వైరస్‌ను తట్టుకుని నిలబడుతుంది. తట్టుకోలేని వారి రోగులుగా మారుతారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా యాంటీ బాడీస్ రక్తంలో ఉండిపోతాయి. వీటిని ఉపయోగించే ఈ చికిత్స చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+