వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేరా జవాన్ సబ్ సే మజ్బూత్: ప్రధానిపై దాడికి దిగిన కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ తో ఒకవంక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. మరోవంక భారతీయ జనతాపార్టీ బూత్ స్థాయి కమిటీలు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. కాంగ్రెస్ కు అనుకోని అస్త్రంలా దొరికింది. రాజకీయంగా బీజేపీని ఇరుకున పెట్టడానికి, ఘాటుగా విమర్శలు చేయడానికి కాంగ్రెస్ ఈ సమావేశాన్ని అడ్డుగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలకు అట్టే సమయంలో లేకపోవడం వల్ల బీజేపీ ఇందుకు సమాయాత్తమౌతోంది.

బూత్ స్థాయి కమిటీలు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేయడానికి ప్రధాని.. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు, ఆఫీస్ బేరర్లు, బూత్ స్థాయి నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. దీనిపై కాంగ్రెస్ ఒంటికాలిపై లేచింది. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణాన్ని పెట్టుకుని, జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో.. పార్టీ నాయకులతో మీటింగులేమిటంటూ ధ్వజమెత్తింది కాంగ్రెస్. మేరా బూత్ సబ్ సే మజ్బూత్ అంటూ బీజేపీ పార్టీ పరంగా నినదిస్తోందని, తాము మాత్రం మేరా జవాన్ సబ్ సే మజ్బూత్.. అంటూ భారత సైన్యాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది.

PM chose to address the booth workers of the BJP rather than address the nation, says Congress

సైన్యం సరిహద్దుల వద్ద పహారా కాస్తోంటే.. కాపలాదారు బూత్ ల కాపలా కాస్తున్నారా?

సైనికులు రేయింబవళ్లు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పహారా కాస్తుండగా.. ప్రధాన కాపలదారు బూత్ ల వద్ద కాపలా కాస్తున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు. దేశం మొత్తం వింగ్ కమాండర్ అభినందన్ కోసం ఎదురుచూస్తుండగా.. ప్రధాని బూత్ కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాము గురువారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, ర్యాలీని రద్దు చేశామని సూర్జేవాలా గుర్తు చేశారు.

ప్రధాని మాత్రం తన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని కూడా రద్దు చేయలేకపోయారని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ లో రికార్డింగ్ చేస్తూ కూర్చున్నారని చురకలు అంటించారు. అభినందన్ ను విడుదల చేయించడానికి దౌత్య పరమైన చర్చలు చేపట్టాల్సిన ప్రధాని.. పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ విమర్శించారు.

English summary
At this point in time when the nation is looking towards its leadership, when the nation wants its leadership to speak to it, the Prime Minister chose to address the booth workers of the BJP rather than address the nation Congress Senior leader Manish Tewari criticised on Narendra Modi, who addressed the BJP booth level workers and leaders. There is a time to act and a time to talk, dialogue can only take place when the atmosphere is conducive for it, current atmosphere is not conducive..he added. If Navjot Singh Sidhu has an opinion, that is his personal opinion, not the opinion of the Congress.. Manish Tewari says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X