PM Kisan: రైతులకు శుభవార్త.. బుధవారమే పీఎం కిసాన్ నిధులు విడుదల..

అన్నదాతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్(PM Kisan) నిధి 15వ విడత డబ్బులు బుధవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వం నవంబర్ 15వ తేదీన డిబిటి ద్వారా అర్హులైన రైతుల ఖాతాలకు వాయిదాలలో రూ.2000 జమ చేయనుంది. ఈసారి కూడా చాలా మంది అనర్హుల పేర్లను ప్రభుత్వం జాబితా నుంచి తొలగించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌ ట్విట్టర్‌లో 15వ విడతకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి వాయిదాల సొమ్మును జమ చేస్తామని చెప్పారు.

ప్రతిసారీ లాగానే ఈసారి కూడా కోట్లాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత అందకుండా పోయే అవకాశం ఉంది. వివిధ పోర్టల్స్‌తో అనుసంధానం కాని రైతుల ఖాతాల్లోకి డబ్బులు రావని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. భూలేఖ్ వెరిఫికేషన్ పూర్తి చేయడం, ఆధార్ సీడింగ్ చేయడం కూడా అవసరం. ఆధార్ సీడింగ్ చేసిన రైతులకు మాత్రమే 15వ విడత రానుంది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి పథకం ప్రారంభించింది.

PM Kisan money will be deposited in farmers accounts on November 15

ఈ పథకం కింద సంవత్సరానికి మూడు విడతల్లో రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. పథకానికి అర్హత పొందాలంటే, భూలేఖ్ ధృవీకరణతో పాటు, ఆధార్ సీడింగ్ కూడా అవసరం. eKYC చేయని రైతులకు ఈసారి కూడా పథకం అందదు. ఈ కేవైసీ చేసుకోవాలంటే.. ముందుగా, PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇప్పుడు ఫారమ్ మూలలో ఉన్న 'e-KYC' ఎంపికపై క్లిక్ చేయాలి.ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్, అభ్యర్థించిన ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని వస్తుంది. దాన్ని సడ్మట్ చేయాలి.

పీఎం కిసాన్ నిధి ఇప్పటి వరకు 14 విడతలుగా రూ.28 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఝార్ఖండ్‌లోని ఖుంటిలో బుధవారం ఉదయం 11.30గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ 15వ విడత నిధులు విడుదల చేయనున్నారు. మీరు మీకు డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే.. పీఎం కిసాన్ వెబ్ సైట్ కు వెళ్లాలి. బెనిఫిషర్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు డబ్బులు జమ అయ్యయో లేదో తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+