PM Kisan: రైతులకు శుభవార్త.. నేడే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం విడుదల చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 13 విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. సోమవారం కర్ణాటకలోని బెలగావిలో పర్యటించనున్న ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్లును జమ చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు విడుదలతో పాటు శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది.

రూ.24 వేలు

రూ.24 వేలు

ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంత్సవరానికి రూ.6 వేలు అన్నదాతల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 12 విడతలుగా రూ.24 వేలు ను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. సోమవారం 13వ విడత రూ.2 వేలు కర్షకుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ పథకం కింద రైతులు డబ్బులు పొందాలనుకుంటే కచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోకుంటే పైసలు రావు.

రైతు బంధు

రైతు బంధు

ఇప్పటికి కూడా ఈకైవేసీ చేసుకోని రైతులు వెంటనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ కు వెళ్లి ఈకేవైసీ చేసుకోవచ్చు.ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బంధు కింద ఎకరానికి రూ.10 చొప్పున రెండు దఫాలుగా అందిస్తోంది. యాసంగికి రూ.5 వేలు, వానకాలానికి రూ.5 వేలు అందిస్తోంది. కాగా.. పీఎం కిసాన్ పథకం ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ట్యాక్య్ ఫైల్ చేసేవారి వర్తించదు. రైతు బంధు మాత్రం వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.

రుణ మాఫీ

రుణ మాఫీ

తెలంగాణ ప్రభత్వం రైతు బంధు అమలు చేయడమే కాకుండా రుణ మాఫీ కూడా చేస్తోంది. ఇప్పటి వరకు రూ.50 వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూ.90 వేల లోపు రుణాలు మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం రూ.లక్ష మాఫీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+