PM Kisan: శుభవార్త.. పీఎం కిసాన్ 17వ విడత విడుదల..!
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన 17వ విడత నిధులు విడుదల చేసింది. జూన్ 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిధులు విడుదల చేశారు. మొత్తం 9.26కోట్ల మంది రైతులకు దాదాపు రూ. 20 వేల కోట్ల రూపాయలు జమ చేశారు. రైతులకు ఆర్థిక సహాయం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6 వేల ను రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు ఇస్తారు. ఇప్పటి వరకు 16 విడతలుగా అన్నదాతల ఖాతాల్లో రూ.32 వేలు జమ చేశారు. పీఎం కిసాన్ యోజన పథకం నుంచి లబ్ధి పొందాలంటే.. రైతులు తప్పనిసరిగా ఇ కేవైసీ చేసుకోవాలి. ఇ కేవైసీ చేసుకుంటేనే రైతులకు డబ్బులు వస్తాయి. ఇప్పటికీ ఇ కేవీసీ చేసుకోకుంటే.. చేసుకోవచ్చు. దాని కోసం పీఎం కిసాన్ వెబ్ సైట్ కు వెళ్లాలి.

ఇ కేవైసీపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ అథంటికేషన్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ నంబర్ ఎంటర్ చేయగానే మీ మీ ఇ కేవైసీ పూర్తి అవుతుంది. అయితే మీ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ తో లింక్ అయి ఉండాలి. పీఎం కిసాన్ యోజన డబ్బులు జమ అయ్యాయో కాలేదు కూడా తెలుసుకోవచ్చు. దాని కోసం https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లాలి. వెబ్ సైట్ లో లబ్ధిదారుల లిస్ట్ ఉంటుంది. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కూడా చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications