Manipur: ప్రధాని మోదీ, అమిత్ షాతో బీజేపీ టాప్ లీడర్స్ చర్చలు, ఏం చేద్దామ్ సార్ !
మణిపూర్/ఇంపాల్: మణిపూర్ లో కుకీలు- మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న వర్గపోరు వ్యవహారం విదేశాల్లో కూడా చర్చకు దారితీసింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మణిపూర్ చర్చ ఎక్కువగా జరుగుతోంది. మణిపూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద పడిపడుతున్నాయి.
ప్రతిపక్షాలు కలిసి ఎదురుదాడి చెయ్యడానికి సిద్దం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సీనియర్ నాయకులతో వరుస మావేశాలు నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది. సోమవారం పార్లమెంట్ లో బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ నాయకులు వరుస సమావేశాలు నిర్వహించారని తెలిసింది.

సోమవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంట్ లోని ప్రత్యేక గదిలో చాలాసేపు చర్చించారని తెలిసింది. తరువాత కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా నేరుగా ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయానికి వెళ్లి కొన్ని గంటల పాటు మణిపూర్ వ్యవహారం గురించి చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా మణిపూర్ విషయంలోనే చర్చించారని తెలిసింది. తరువాత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేకంగా చర్చించారని తెలిసింది.
అస్సాం ముఖ్యమంత్రి కూడా కేంద్ర మంత్రి అమిత్ షాతో మణిపూర్ వియషం గురించి చర్చించారని సమాచారం. అయితే కుకీ గ్రూప్ లీడర్స్ చర్చలు తరువాత వారి నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఎదురు చూస్తున్నారని తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం కావాలని కుకీలు చేస్తున్న డిమాండ్ పై ఆ కుల సంఘం నాయకులు ఇదే వారంలో తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మణిపూర్ లో కుకీ ఇన్ఫి మణిపూర్ (కేఐఎం) గిరిజన సంఘం మణిపూర్ లోనే చాలా బలమైన సంఘం. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ సంఘం డిమాండ్ చేస్తోంది. కుకీల చేస్తున్న డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వం సానుభూతి చూపిస్తున్నప్పటికి మైతేయ్ ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆలోచిస్తోంది.
మణిపూర్ లో శాంతిని కాపాడుతామని కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే హామీ ఇచ్చారని కుకీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా పక్కాక్లారిటీ ఇవ్వలేదని కుకీ వర్గం నాయకులు అంటున్నారు. మణిపూర్ లో శాంతిని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా పని చేస్తోందని మణిపూర్ ప్రభుత్వంలోకి కొందరు అంటున్నారు.
గత కొన్ని రోజులుగా మణిపూర్ లో హింస తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అయితే మణిపూర్ లో రోజురోజుకు హింస పెరిగిపోతున్నదని, అయినా ఏమాత్రం పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా చోద్యం చూస్తూ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.












Click it and Unblock the Notifications